
సౌతాఫ్రికా టీ20 లీగ్ లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మరింత పటిష్టంగా మారనుంది. మార్కరం, స్టబ్స్, మార్కో జాన్సెన్, బవుమా లాంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లను ఉన్న జట్టులో మరో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు చేరనున్నారు. ఇంగ్లాండ్ టెస్ట్ ఓపెనర్ జాక్ క్రాలీ, నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వేను సన్ రైజర్స్ జట్టు దక్కించుకుంది. ఈ ఇద్దరి ప్లేయర్లను తన జట్టులోకి తీసుకుంటున్నట్లు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
క్రాలే ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో రెగ్యులర్ ఆటగాడు. 26 ఏళ్ల అతను ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ లో హోబర్ట్ హరికేన్స్ తరపున ఆడాడు. ఇంగ్లండ్ T20 బ్లాస్ట్ లో కెంట్ తరపున సెంచరీ చేశాడు. తాను ఎప్పుడూ మంచి వైట్-బాల్ ప్లేయర్‌గా ఉండాలని కోరుకుంటున్నానని ఇటీవలే క్రాలీ అన్నాడు. కొత్త షాట్స్ ను ప్రయత్నిస్తున్నానని.. టీ20 క్రికెట్‌లో తన రికార్డ్ బాగుందని చెప్పుకొచ్చాడు. సన్ రైజర్స్ జట్టులో చేరడం ఆనందంగా ఉందని.. నెట్స్‌లో తీవ్రంగా కష్టపడుతున్నానని తెలిపాడు.
నెదర్లాండ్స్ వెటరన్ స్పిన్నర్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వే తమ జట్టులోకి వస్తాడని ధృవీకరించారు. చివరి సీజన్ లో ఈ నెదర్లాండ్స్ స్పిన్నర్ జట్టుకు దూరమయ్యాడు. వాన్ డెర్ మెర్వే మొదటి సీజన్ లో సన్ రైజర్స్ తరపున 20 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. సౌతాఫ్రికా టీ20 సీజన్ జనవరి 9 నుండి ఫిబ్రవరి 8 వరకు జరుగుతుంది. ఇప్పటివరకు ఈ లీగ్ రెండు సీజన్ లు జరిగింది. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచింది.
Sunrisers Eastern Cape Bolster Squad for SA20 Season 3 with Roelof van der Merwe and Zak Crawley. pic.twitter.com/JVWzxytuLK
— CricketGully (@thecricketgully) July 30, 2024