SA20 2024 Final: మరి కొన్ని గంటల్లో ఫైనల్.. సన్ రైజర్స్ కప్ కొడుతుందా..?

దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నేటితో (ఫిబ్రవరి 10న) ముగియనుంది. నెల రోజుల పాటు అభిమానులకు వినోదాన్ని అందించిన ఈ మెగా లీగ్ ఫైనల్ ఆడేందుకు డిఫెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, డర్బన్ సూపర్ జయింట్స్ సిద్ధమయ్యాయి. రాత్రి 9 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మెగా ఫైనల్లో సన్ రైజర్స్ విజయం సాధిస్తే వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ 18 లో ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. మొబైల్స్ లో జియో సినిమాలో ఈ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది.      

లీగ్ దశలో సన్ రైజర్స్ 10 మ్యాచ్ లాడి 7 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. మొత్తం 33 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది. మరోవైపు డర్బన్ సూపర్ జయింట్స్ 10 మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ ల్లో గెలిచి 3 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. మొత్తం 32 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు క్వాలిఫయర్ 1 లో ఆడగా.. సన్ రైజర్స్ 51 పరుగుల తేడాతో గెలిచింది. సెకండ్ క్వాలిఫయర్ లో డర్బన్ సూపర్ జయింట్స్ జోబర్గ్ సూపర్ కింగ్స్ పై 69 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరుకుంది. 

ఇరు జట్ల బలాబలాలు:

సన్ రైజర్స్ ప్రధాన బలం వారి బ్యాటింగ్ అనే చెప్పుకోవాలి. కెప్టెన్ మార్కరం, ట్రిస్టన్ స్టబ్స్ తో పాటు డేవిడ్ మలాన్ లాంటి అంతర్జాతీయ స్టార్లు ఆ జట్టులో ఉన్నారు. వీరితో పాటు క్రూజ్, మార్కో జాన్సెన్ బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. బార్ట్ మెన్, వొరల్, హార్మర్ లాంటి బౌలర్లు టాప్ ఫామ్ లో ఉన్నారు. వీరందరూ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే మరోసారి టైటిల్ కొట్టడం గ్యారంటీ.
 
డర్బన్ సూపర్ జయింట్స్ విషయానికి వస్తే సన్ రైజర్స్ కంటే బలంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసన్ నెక్స్ట్ లెవల్ ఫామ్ లో ఉన్నాడు. డికాక్,జార్జ్, జేజే స్ముట్స్ ఆడితే సన్ రైజర్స్ కు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ లో ఆ జట్టు దుర్బేధ్యంగా కనిపిస్తుంది. టాప్లె, నవీన్ ఉల్ హక్, జూనియర్ డాల, కేశవ్ మహారాజ్ లాంటి అంతర్జాతీయ స్టార్లు ఆ జట్టులో ఉన్నారు. దీంతో ఇరు జట్ల మధ్యహోరాహోరీ జరగటం గ్యారంటీగా కనిపిస్తుంది.