దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా ప్లే ఆఫ్ కు ముందు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జూలు విదిల్చింది. ప్రత్యర్థి జోబర్గ్ సూపర్ కింగ్స్‌పై తొమ్మిది వికెట్ల విజయం సాధించిన సన్ రైజర్స్.. ప్లే ఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్లు విజ్రంభించడంతో మొదట బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ కేవలం 78 పరుగులకే ఆలౌటైంది.
సూపర్ కింగ్స్ జట్టులో వేన్ మాడ్సెన్ 23 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 32 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జట్టులో 8 మంది బ్యాట్స్‌మెన్ కనీసం రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయారు. మాడ్సెన్ తో పాటు లూక్ డు ప్లూయ్ (18) డగ్ బ్రేస్‌వెల్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఈస్టర్న్ క్యాప్ బౌలర్లలో డేనియల్ వోరల్, పాట్రిక్ క్రుగ్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. మార్కో జాన్సెన్, బియర్స్ స్వానెపోయెల్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.
లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఒక వికెట్ కోల్పోయి 11 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోర్డాన్ హర్మన్ రూపంలో జట్టు 29 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే మలాన్, టామ్ అబెల్ రెండో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ను గెలిపించారు. సూపర్ కింగ్స్ తరఫున లిజాడ్ విలియమ్స్ 1 వికెట్ తీశాడు. డేవిడ్ మలన్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మూడు రోజుల క్రితం ముంబైపై 98 పరుగుల లక్ష్యాన్ని 5.4 ఛేజ్ చేసి చెన్నై రికార్డ్ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Defending champions Sunrisers Eastern Cape flatten Joburg Super Kings to march into the #SA20 knockouts ?https://t.co/8IvoJtFkOC pic.twitter.com/SBl8bxNHvI
— ESPNcricinfo (@ESPNcricinfo) January 31, 2024