సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మంగళవారం (ఏప్రిల్ 9) స్పిన్నర్ వనిందు హసరంగ దూరమైనట్లు ధృవీకరించింది. గాయం కారణంగా ఐపీఎల్ 2024 నుంచి హసరంగా తప్పుకున్నాడు. గాయంతో ఇబ్బందిపడుతున్న హసరంగ.. ఐపీఎల్ 2024కి అందుబాటులో లేడని శ్రీలంక క్రికెట్ బీసీసీఐకి తెలియజేసినట్లు గత వారం నివేదికలు వెల్లడించాయి. డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో హసరంగా రూ.1.5 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. హసరంగా లేడని కన్ఫర్మ్ కావడంతో అతని స్థానంలో సన్ రైజర్స్ యాజమాన్యం విజకాయకాంత్ వియస్కాంత్‌ని ఎంపిక చేసింది.
ఎవరీ విజయకాంత్?
విజకాయకాంత్ శ్రీలంకకు చెందిన లెగ్ స్పిన్నర్. జాతీయ జట్టు తరపున ఇప్పటివరకు ఒకటే టీ20 మ్యాచ్ ఆడాడు. 2023 అక్టోబర్ లో ఆఫ్ఘనిస్తాన్ పై అరంగేట్రం చేసి నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి ఒకటే వికెట్ తీశాడు. తొలి మ్యాచ్ లోనే పొదుపుగా బౌలింగ్ చేసిన ఈ 22 ఏళ్ళ యువ స్పిన్నర్ భవిష్యత్తులో శ్రీలంక తరపున సంచలనంగా మారతాడని ఇప్పటికే కొంతమంది నిపుణులు చెప్పుకొస్తున్నారు. తన మిస్టరీ స్పిన్ తో బోల్తా కొట్టించే ఈ లెగ్ స్పిన్నర్ సన్ రైజర్స్ జట్టులో చేరి ఎంతవరకు ప్రభావం చూపిస్తాడో చూడాలి.
Here is Vijayakanth Viyaskanth who has replaced Wanindu Hasaranga for @SunRisers in the #IPL2024 pic.twitter.com/jKSVwu4eLo
— Nibraz Ramzan (@nibraz88cricket) April 9, 2024
లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్‌తో పాటు.. ఇంటర్నేషనల్ లీగ్ T20లో MI ఎమిరేట్స్ తరపున ఆడాడు.బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో చటోగ్రామ్ ఛాలెంజర్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు తన లెగ్ స్పిన్ తో 33 మ్యాచ్ ల్లో 42 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 2 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. నేడు (ఏప్రిల్ 7) పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.
🚨 ANNOUNCEMENT 🚨
— SunRisers Hyderabad (@SunRisers) April 9, 2024
Wanindu Hasaranga will be unavailable for the season due to injury. We would like to wish him a speedy recovery.
Sri Lankan spinner Vijayakanth Viyaskanth has joined the squad as his replacement for the rest of #IPL2024. Welcome, Viyaskanth! ✨ pic.twitter.com/A2Z5458dH8