
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బ్రైడాన్ కార్స్ 2025 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కార్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతూ గాయపడ్డాడు. శనివారం(ఫిబ్రవరి 22) లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ బి ప్రారంభ మ్యాచ్‌లో కాలి గాయం అతన్ని ఇబ్బంది పెట్టింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఈ ఇంగ్లీష్ ఆల్ రౌండర్ ఐపీఎల్ కు కూడా అందుబాటులో ఉండడం లేదు.
బ్రైడాన్ కార్స్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో సన్ రైజర్స్ గురువారం (మార్చి 7) రీప్లేస్ మెంట్ ను ప్రకటించింది. కార్స్ స్థానంలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్‌ను సన్ రైజర్స్ తమ జట్టులోకి తీసుకోనున్నట్టు ఐపీఎల్ తమ ఎక్స్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ముల్డర్ రూ.75 లక్షల కనీస ధరతో హైదరాబాద్ జట్టులో చేరనున్నాడు. సౌతాఫ్రికా తరపున ఈ 27 ఏళ్ళ ఆల్ రౌండర్ 11 టీ20, 18 టెస్ట్‌లు, 25 వన్డేలు ఆడాడు. ఇటీవలే సౌతాఫ్రికా లీగ్ లో అద్భుతంగా రాణించాడు. ముల్డర్ రాకతో సన్ రైజర్స్ పటిష్టంగా తయారైంది. ఈ సఫారీ ఆల్ రౌండర్ కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్ కావడం విశేషం.
Also Read :- 25 పరుగులు జట్టుకు సరిపోతాయా..?
ఐపీఎల్ సీజన్ కోసం సన్ రైజర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆదివారం (మార్చి 2) ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న సన్ రైజర్స్ ఆటగాళ్లు వార్మప్, ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. సన్ రైజర్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2025 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ జట్టును పాట్ కమ్మిన్స్ నడిపించనున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, ఇషాన్ కిషాన్, మహమ్మద్ షమీ, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో హైదరాబాద్ జట్టు బలంగా కనిపిస్తుంది. సన్ రైజర్స్ కంటే ముందే చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్రాక్టీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
సన్‌రైజర్స్ మ్యాచ్‌ల షెడ్యూల్
మార్చి 23: సన్‌రైజర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ఉప్పల్ స్టేడియం)
మార్చి 27: సన్‌రైజర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (ఉప్పల్ స్టేడియం)
మార్చి 30: సన్‌రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (వైజాగ్ స్టేడియం)
ఏప్రిల్ 03: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
ఏప్రిల్ 06: సన్‌రైజర్స్ vs గుజరాత్ టైటాన్స్ (ఉప్పల్ స్టేడియం)
ఏప్రిల్ 12: సన్‌రైజర్స్ vs పంజాబ్ కింగ్స్ (ఉప్పల్ స్టేడియం)
ఏప్రిల్ 17: ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ (వాంఖడే స్టేడియం, ముంబై)
ఏప్రిల్ 23: సన్‌రైజర్స్ vs ముంబై ఇండియన్స్ (ఉప్పల్ స్టేడియం)
ఏప్రిల్ 25: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ (చెన్నై)
మే 02: గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ (అహ్మదాబాద్)
మే 05: సన్‌రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ఉప్పల్ స్టేడియం)
మే 10: సన్‌రైజర్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (ఉప్పల్ స్టేడియం)
మే 13: బెంగళూరు vs సన్‌రైజర్స్ (బెంగళూరు)
మే 18: లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ (లక్నో)
Wiaan Mulder will join SRH for INR 75 Lakh 🔁
— ESPNcricinfo (@ESPNcricinfo) March 6, 2025
He replaces Brydon Carse, who is ruled out of the 2025 IPL due to injury pic.twitter.com/IgdE7Imvhg