
ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీలో సన్ రైజర్స్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిస్తే.. ఢిల్లీ ఆడిన ఒకే మ్యాచ్ లో గెలిచింది. సన్ రైజర్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. సిమర్జీత్ సింగ్ స్థానంలో జీషాన్ జట్టులోకి వచ్చాడు. మరో వైపు ఢిల్లీ జట్టులో సమీర్ రిజ్వి స్థానంలో రాహుల్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(c), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ
Also Read : వాళ్లకు గౌరవం ఇవ్వాల్సిందే
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్