
ఐపీఎల్ లో సన్ రైజర్స్ మరో సవాలుకు సిద్ధమైంది. గురువారం (ఏప్రిల్ 3) కోల్‌కతా రైడర్స్ తో మ్యాచ్ ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలో రెండు జట్లకు ఇది నాలుగో మ్యాచ్. ఇరు జట్లు మూడు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచి రెండు ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. కోల్‌కతా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. స్పెన్సర్ జాన్సెన్ స్థానంలో మొయిన్ అలీ జట్టులోకి వచ్చాడు. మరోవైపు సన్ రైజర్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కామిందు మెండీస్, సిమర్జీత్ సింగ్ జట్టులోకి వచ్చారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కమిందు మెండిస్, సిమర్‌జీత్ సింగ్, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, జీషన్ అన్సారీ
Also Read : అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిన వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):
క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి, రమణదీప్ సింగ్