హైదరాబ్యాడ్ షో.. ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న సన్ రైజర్స్

హైదరాబ్యాడ్ షో.. ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్న సన్ రైజర్స్

127 రన్స్ ఛేజ్లో ఢమాల్
ఏడో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఔట్!
పంజాబ్ అనూహ్య విజయం
రాణించిన జోర్డాన్, అర్షదీప్

దుబాయ్: టార్గెట్ 127 రన్స్. డేవిడ్ వార్నర్ (20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35), బెయిర్స్టో (19) మెరుపులతో పవర్ ప్లేలోనే 52 రన్స్ వచ్చేశాయి. వెంటవెంటనే మూడు వికెట్లు పడ్డా మనీశ్ పాండే (29 బంతుల్లో 15), విజయ్ శంకర్ (27 బంతుల్లో 4 ఫోర్లతో 26) ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. 30 బాల్స్లో 30 రన్స్ కావాలి. చేతిలో ఏడు వికెట్లున్నాయి. బంతికో పరుగు చేసినా రైజర్స్దే విజయం. ఇలాంటి సిచ్యువేషన్లో అత్యంత దారుణంగా ఆడిన హైదరాబాద్ ఘోర ఓటమి మూటగట్టుకుంది. లాస్ట్ మ్యాచ్లో చెలరేగిన మనీశ్ అతి జాగ్రత్త.. లోయర్ఆర్డర్ బ్యాట్స్మెన్ చెత్తాట సన్రైజర్స్ను ముంచింది. ఏమాత్రం ఆశలే లేని టైమ్లో 14 పరుగుల తేడాతో ఆరు వికెట్లు తీసిన బౌలర్లు పంజాబ్కు అనూహ్య విజయం కట్టబెట్టి జట్టును ప్లేఆఫ్ రేసులో నిలిపారు. బౌలర్లు రాణించినా చెత్త బ్యాటింగ్తో శనివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 12 పరుగుల తేడాతో ఓడింది. దాంతో పదకొండు మ్యాచ్ల్లో ఏడో ఓటమితో ప్లే ఆఫ్ ఆశలు వదులుకుంది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 7వికెట్లకు 126 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (28 బంతుల్లో 2 ఫోర్లతో 32) టాప్ స్కోరర్. రషీద్ ఖాన్ (2/14)తో పాటు సందీప్ కుమార్ (2/29), జేసన్ హోల్డర్ (2/27) తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం హైదరాబాద్ 19.5ఓవర్లలో 114 రన్స్కు ఆలౌటైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ క్రిస్ జోర్డాన్ (3/17), అర్షదీప్ (3/23) చివర్లో అద్భుత బౌలింగ్తో పంజాబ్ను గెలిపించారు.

బౌలర్లు అదుర్స్
తొలుత పంజాబ్ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో హైదరాబాద్ బౌలర్లు సక్సెస్ అయ్యారు. టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ వార్నర్ డిసిజన్కు పూర్తి న్యాయం చేశారు. హార్డ్ హిట్టర్లతో కూడిన పంజాబ్ 7 నుంచి18 ఓవర్ల మధ్య ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేదంటే రైజర్స్ బౌలింగ్ ఏ రేంజ్లో ఉందో చెప్పొచ్చు. గాయంతో మయాంక్ ఈ మ్యాచ్కు దూరమవగా.. మన్దీప్ సింగ్ (14 బంతుల్లో 17)తో కెప్టెన్ రాహుల్ (27 బంతుల్లో 27) ఫస్ట్ వికెట్కు ఐదు ఓవర్లలో 37 రన్స్ జోడించి మంచి ఆరంభమే ఇచ్చారు. కానీ, క్రాస్సీమ్ డెలివరీతో మన్దీప్ను ఔట్ చేసిన సందీప్ ఐపీఎల్లో వందో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. వన్డౌన్లో వచ్చిన క్రిస్ గేల్ (20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్తో 20).. హోల్డర్ బౌలింగ్లో రెండు ఫోర్లు, రషీద్ వేసిన ఏడో ఓవర్లో ఓ సిక్సర్తో ఊపు మీద కనిపించాడు. అయితే, పదో ఓవర్లో హోల్డర్ వేసిన స్లో బాల్కు లాంగాఫ్లో అతను వార్నర్కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్కే రాహుల్ డిఫెన్స్ను బ్రేక్ చేసిన రషీద్ పంజాబ్ను 66/3తో ఒత్తిడిలో పడేశాడు. అక్కడి నుంచి కింగ్స్ కోలుకోలేకపోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (12) , దీపక్ హుడా (0) నిరాశ పరిచారు. ఫామ్లో ఉన్న నికోలస్ పూరన్ ఒక్కో పరుగు జత చేసినా.. అవతలి ఎండ్లో అతనికి సపోర్ట్ లభించలేదు. క్రిస్ జోర్డాన్ (7), ఖలీల్కు క్యాచ్ ఇచ్చాడు. స్కోరు వంద దాటిన తర్వాత 18వ ఓవర్లో మురుగన్ (4) రనౌటయ్యాడు. 69 బాల్స్ తర్వాత 18వ ఓవర్లో బౌండ్రీ కొట్టిన పూరన్ .. నటరాజన్ వేసిన లాస్ట్ ఓవర్లో మరో ఫోర్ రాబట్టి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు.

రైజర్స్ చేజేతులా..
చిన్న టార్గెట్ ఛేజింగ్లో రైజర్స్కు మెరుపు ఆరంభం దక్కింది. ఓపెనర్ వార్నర్ ధాటిగా ఆడాడు. ఫస్ట్ రెండు ఓవర్లలో షమీ (1/34)కి, అర్షదీప్ కు అతను సిక్సర్లతో స్వాగతం పలికాడు. బెయిర్స్టో కూడా నాలుగు ఫోర్లతో జోరు పెంచాడు. పవర్ప్లేలో 52 రన్స్ రావడంతో రైజర్స్ ఈజీగా నెగ్గేలా కనిపించింది. కానీ, ఐదు పరుగుల తేడాలో మూడు వికెట్లు తీసిన పంజాబ్ రేసులోకి వచ్చింది. రవి బిష్నోయ్ (1/13) వేసిన ఏడో ఓవర్లో వార్నర్ రివర్స్ చేయబోయి వికెట్ల ముందు దొరికాడు.. ఆపై, మురుగన్ అశ్విన్ (1/27) బౌలింగ్లో బెయిర్స్టో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. షమీ ఓవర్లో అబ్దుల్ సమద్ (7) మిడాఫ్లో జోర్డాన్కు చిక్కడంతో 56/0 నుంచి 61/3తో డిఫెన్స్లో పడింది రైజర్స్. దాంతో, లాస్ట్ మ్యాచ్ హీరోలు పాండే, విజయ్ శంకర్పై మరోసారి భారం పడింది. టార్గెట్ చిన్నదే కావడంతో ఇద్దరూ అతి జాగ్రత్తగా ఆడడంతో రన్రేట్ తగ్గింది. మురుగన్ వేసిన 14 ఓవర్లో రెండు ఫోర్లు, అర్షదీప్ బౌలింగ్లో ఓ ఫోర్తో శంకర్ స్పీడు పెంచాడు. కానీ, 24 బాల్స్లో 27 రన్స్ అవసరమైన టైమ్లో జోర్డాన్ బౌలింగ్లో పాండే స్ట్రెయిట్ సిక్సర్కు ట్రై చేయగా.. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ సుచిత్ బౌండ్రీ లైన్ దగ్గర అద్భుత క్యాచ్ అందుకున్నాడు. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. అదే ఓవర్ లాస్ట్ బాల్కు ఫోర్ కొట్టిన విజయ్ టెన్షన్ తగ్గించాడు. కానీ, 18వ ఓవర్లో విజయ్ను కాట్ బిహైండ్ చేసిన అర్షదీప్ రైజర్స్కు భారీ షాకిచ్చాడు. ఆపై 18వ ఓవర్లో హోల్డర్ (5), రషీద్(0)ను ఔట్ చేసిన జోర్డాన్ 3 రన్సే ఇవ్వడంతో టెన్షన్ పెరిగింది. ఇక, అర్షదీప్ వేసిన లాస్ట్ ఓవర్లో 14 పరుగులు అవసరం అవగా.. సందీప్ (0), గార్గ్ (3) షాట్లకు ప్రయత్నించి ఔటవగా.. ఖలీల్ (0) రనౌటవడంతో రెండే పరుగులొచ్చాయి.

సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 20 ఓవర్లలో 126/7 (పూరన్ 32 నాటౌట్, గేల్ 20; రషీద్ 2/14, హోల్డర్ 2/27);
హైదరాబాద్: 19.5 ఓవర్లలో 114 ఆలౌట్ (వార్నర్ 35, శంకర్ 26, జోర్డాన్ 3/17, అర్షదీప్ 3/23).

For More News..

జూన్లో కరోనా వ్యాక్సిన్ ఖాయం

ఐటీ రిటర్న్స్ లో కొత్త రూల్స్