MI vs SRH: బ్యాటింగ్‌లో తడబడిన సన్ రైజర్స్.. ముంబై ఇండియన్స్ ముందు సాధారణ లక్ష్యం

MI vs SRH: బ్యాటింగ్‌లో తడబడిన సన్ రైజర్స్.. ముంబై ఇండియన్స్ ముందు సాధారణ లక్ష్యం

గురువారం (ఏప్రిల్ 17) వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటింగ్ లో అంచనాలకు మించి రాణించలేకపోయింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మన బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో జాక్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. జాక్స్, బోల్ట్, పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.     

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ప్రారంభంలో ఆచితూచి ఆడింది. పవర్ ప్లే లో ముంబై బౌలర్లు చెత్త బంతులు వేయకుండా కట్టడి చేయడంతో తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 46 పరుగులు మాత్రమే చేయగలిగింది. పపవర్ ప్లే తర్వాత అభిషేక్ శర్మ బీహార్ షాట్ కు ప్రయత్నించి హార్దిక్ పాండ్య బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే కిషాన్ (2) స్టంపౌట్ కావడంతో ముంబై స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోయింది. క్రీజ్ లో ఉన్నంత సేపు ఇబ్బంది పడిన ట్రావిస్ హెడ్ 29 బంతుల్లో 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 

►ALSO READ | MI vs SRH: రివెంజ్ మిస్: ఇషాన్ కిషాన్ ఔట్.. పట్టరాని సంతోషంలో నీతా అంబానీ

జిడ్డు బ్యాటింగ్ తో విసిగించిన నితీష్ రెడ్డి కూడా 21 బంతుల్లో 19 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఇన్నింగ్స్ మొత్తం చప్పగా సాగిందనుకుంటున్న సమయంలో క్లాసన్ 18 ఓవర్లో దుమ్ములేపాడు. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదడంతో ఈ ఓవర్ లో మొత్తం 20 పరుగులు వచ్చాయి. బుమ్రా వేసిన 19 ఓవర్లో క్లాసన్ (37) ఔటైనా అనికేత్ వర్మ(18), కమ్మిన్స్(8) చివరి ఓవర్లో 20 పరుగులు రాబట్టడంతో సన్ రైజర్స్ 160 పరుగుల మార్క్ దాటింది.