
హైదరాబాద్: ఈ సీజన్ ఐపీఎల్‌కు రెడీ అవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. బొటన వేలి గాయంతో బాధపడుతున్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్సీ ప్లేస్‌లో సౌతాఫ్రికాకు చెందిన వియాన్ ముల్డర్‌ను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ గురువారం వెల్లడించింది. త్వరలోనే ముల్డర్ జట్టుతో చేరుతాడని తెలిపింది. ‘గాయం కారణంగా కార్సీ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు.
అతని స్థానంలో ముల్డర్‌ను తీసుకున్నాం. ఇందుకోసం రూ. 75 లక్షలు వెచ్చించాం’ అని ఎస్‌ఆర్‌హెచ్ పేర్కొంది. చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆడిన ముల్డర్ 18 టెస్ట్‌లు, 25 వన్డేలు, 11 టీ20ల్లో సౌతాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కార్సీ గాయపడ్డాడు.