సొంత మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. బెంగుళూరు బౌలర్లను బెంబేలెత్తిస్తూ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగుల భారీ స్కోరు సాధించింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఆదిలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 27 పరుగుల వద్ద అభిషేక్ శర్మ, 28 పరుగుల వద్ద రాహుల్ త్రిపాఠి ఔటయ్యారు. ఈ సమయంలో కెప్టెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్ జట్టును ఆదుకున్నాురు. మూడో వికెట్ కు 76 పరుగులు జోడించారు. అయితే 18 పరుగులు చేసిన మార్కరమ్.. షాబాద్ అహ్మద్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
క్లాసన్ సెంచరీ..
ఈ సమయంలో జట్టుకు భారీ స్కోరును అందించే బాధ్యతను క్లాసెన్ భుజాన వేసుకున్నాడు. హ్యారీ బ్రూక్ తో కలిస స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సిక్సులు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇదే క్రమంలో 51 బంతుల్లో 6 సిక్సులు, 8 ఫోర్లతో 108 పరుగులు చేశాడు. చివర్లో హ్యారీ బ్రూక్ మెరుపులు మెరిపించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో బ్రేస్ వెల్ 2 వికెట్లు దక్కించుకోగా..షాబాద్ అహ్మద్, హర్షల్ పటేల్, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు.