SRH vs LSG: లక్నోపై దంచికొట్టిన SRH.. రిషబ్ సేన టార్గెట్ ఎంతంటే..?

SRH vs LSG: లక్నోపై దంచికొట్టిన SRH.. రిషబ్ సేన టార్గెట్ ఎంతంటే..?

లక్నో సూపర్ జెయింట్స్‎తో జరుగుతోన్న మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ అంచనాల మేర రాణించలేదు. లీగ్ తొలి మ్యాచులో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఎస్ఆర్‎హెచ్ బ్యాటర్స్.. ఈ మ్యాచులో ఆ మేరకు పరుగులు చేయలేకపోయారు. హెడ్ (47), నితీష్ కుమార్ రెడ్డి (32) యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ (36) రాణించగా.. మిగితా బ్యాటర్లు విఫలం కావడంతో ఎస్ఆర్‎హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్ శార్థుల్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టి ఎస్ఆర్‎హెచ్ బ్యాటర్లను కట్టడి చేశాడు. 

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచులో సన్ రైజర్స్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‎కు దిగింది. లీగ్ తొలి మ్యాచులో భారీ స్కోర్ చేయడంతో ఈ మ్యాచులో కూడా ఎస్ఆర్‎హెచ్‎పై హై ఎక్స్‎పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఈ మ్యాచులో 190 పరుగుల భారీ స్కోరే చేసినప్పటికీ.. అభిమానులు అంచనాలను మాత్రం రీచ్ కాలేదు. ఈ మ్యాచులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‎హెచ్‎కు ఆదిలోనే షాక్ తగిలింది.

సిక్స్ కొట్టి మంచి జోష్‎లో కనిపించిన యంగ్ ప్లేయర్ అభిషేక్ వర్మను శార్థుల్ ఠాకూర్ ఔట్ చేశాడు. దీంతో 6 పరుగులకే అభిషేక్ పెలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషాన్ పూర్తిగా నిరాశపర్చాడు. తొలి మ్యాచులో సెంచరీతో దుమ్మురేపిన ఇషాన్.. ఈ మ్యాచులో డకౌట్ అయ్యాడు. ఈ దశలో హెడ్, నితీష్ కలిసి ఇన్సింగ్స్ నిర్మించారు. వేగంగా ఆడే క్రమంలో హెడ్ (47), నితీష్ (32) ఇద్దరు ఔట్ అయ్యారు. స్టార్ బ్యాటర్ క్లాసెన్ 26 పరుగులతో పర్వాలేదనిపించాడు.

చివర్లో యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మ 13 బంతుల్లో 5 సిక్సుర్లు బాది మెరుపు ఇన్సింగ్స్ ఆడగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 4 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టి 18 పరుగులు చేశాడు.  అనికేత్, కమిన్స్ మెరుపు బ్యాటింగ్‎తో ఎస్ఆర్‎హెచ్ 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో శార్థుల్ ఠాకూర్ 4 కీలకమైన వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాతీ తలో వికెట్ పడగొట్టారు.