
ఐపీఎల్ 2025 ప్రారంభ సమయం దగ్గర పడుతుంది. మరో 18 రోజుల్లో ఈ మెగా లీగ్ గ్రాండ్ గా మొదలు కానుంది. మొత్తం 10 జట్లు తలపడే ఈ టోర్నీ మార్చి 22న ప్రారంభమై మే 25న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. మొత్తం 74 మ్యాచులు 65 రోజులపాటు జరుగుతాయి. లీగ్ దశలో ఒక్కో జట్టు 14 మ్యాచ్‌ల్లో తలపడనుంది. ఇందులో 7 హోమ్ గ్రౌండ్‌లో.. మరో 7 ప్రత్యర్థి వేదికల్లో జరగనున్నాయి.
ఐపీఎల్ సీజన్ కోసం సన్ రైజర్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆదివారం (మార్చి 2) ఉప్పల్ స్టేడియానికి చేరుకున్న సన్ రైజర్స్ ఆటగాళ్లు వార్మప్, ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. సన్ రైజర్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2025 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ జట్టును పాట్ కమ్మిన్స్ నడిపించనున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి, క్లాసన్, ఇషాన్ కిషాన్, మహమ్మద్ షమీ, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో హైదరాబాద్ జట్టు బలంగా కనిపిస్తుంది. సన్ రైజర్స్ కంటే ముందే చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్రాక్టీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
సన్‌రైజర్స్ మ్యాచ్‌ల షెడ్యూల్
మార్చి 23: సన్‌రైజర్స్ vs రాజస్థాన్ రాయల్స్ (ఉప్పల్ స్టేడియం)
మార్చి 27: సన్‌రైజర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ (ఉప్పల్ స్టేడియం)
మార్చి 30: సన్‌రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (వైజాగ్ స్టేడియం)
ఏప్రిల్ 03: కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
ఏప్రిల్ 06: సన్‌రైజర్స్ vs గుజరాత్ టైటాన్స్ (ఉప్పల్ స్టేడియం)
ఏప్రిల్ 12: సన్‌రైజర్స్ vs పంజాబ్ కింగ్స్ (ఉప్పల్ స్టేడియం)
ఏప్రిల్ 17: ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ (వాంఖడే స్టేడియం, ముంబై)
ఏప్రిల్ 23: సన్‌రైజర్స్ vs ముంబై ఇండియన్స్ (ఉప్పల్ స్టేడియం)
ఏప్రిల్ 25: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ (చెన్నై)
మే 02: గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ (అహ్మదాబాద్)
మే 05: సన్‌రైజర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ఉప్పల్ స్టేడియం)
మే 10: సన్‌రైజర్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ (ఉప్పల్ స్టేడియం)
మే 13: బెంగళూరు vs సన్‌రైజర్స్ (బెంగళూరు)
మే 18: లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ (లక్నో)
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
హెన్రిచ్ క్లాసెన్: రూ. 23 కోట్లు (దక్షిణాఫ్రికా, బ్యాటర్/ వికెట్ కీపర్)
పాట్ కమిన్స్: రూ. 18 కోట్లు (కెప్టెన్, ఆస్ట్రేలియా బౌలర్)
అభిషేక్ శర్మ: రూ. 14 కోట్లు
ట్రావిస్ హెడ్: రూ. 14 కోట్లు (ఆస్ట్రేలియా బ్యాటర్)
నితీష్ కుమార్ రెడ్డి: రూ.6 కోట్లు
కొత్తగా కొనుగోలు చేసిన ఆటగాళ్లు
మహ్మద్ షమీ: రూ.10 కోట్లు
హర్షల్ పటేల్: రూ.8 కోట్లు
ఇషాన్ కిషన్: 11.25 కోట్లు
రాహుల్ చాహర్: 3.2 కోట్లు
ఆడమ్ జంపా: రూ.2.4 కోట్లు (ఆస్ట్రేలియా స్పిన్నర్)
అథర్వ తైదే: రూ.30 లక్షలు
అభినవ్ మనోహర్: రూ.3.2 కోట్లు
సిమర్‌జీత్ సింగ్: రూ.1.5 కోట్లు
జీషన్ అన్సారీ: రూ. 40 లక్షలు
జయదేవ్ ఉనద్కత్: కోటి రూపాయలు
బ్రైడన్ కార్సే.. కోటి రూపాయలు (ఇంగ్లండ్ బౌలర్)
కమిందు మెండిస్: రూ. 75 లక్షలు (శ్రీలంక ఆల్ రౌండర్)
అనికేత్ వర్మ: రూ. 30 లక్షలు
ఎషాన్ మలింగ: రూ.1.2 కోట్లు (శ్రీలంక బౌలర్)
సచిన్ బేబీ: రూ. 30 లక్షలు