సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్ ప్రాక్టీస్ షురూ.. ఉప్పల్ స్టేడియంలో రెండు రోజులుగా ముమ్మర సాధన

సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్ ప్రాక్టీస్ షురూ.. ఉప్పల్ స్టేడియంలో రెండు రోజులుగా ముమ్మర సాధన

హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్ 2025 కోసం సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్ షురూ చేసింది. ఉప్పల్ స్టేడియంలో రెండు రోజులుగా ముమ్మరంగా సాధన చేస్తోంది. సోమవారం సాయంత్రం జరిగిన సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పలువురు క్రికెటర్లు నెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా జట్టులోకి వచ్చిన టీమిండియా పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్షల్ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్పిన్నర్ రాహుల్ చహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు సిమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీత్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జీషన్ అన్సారీ, అభినవ్ మనోహర్ తదితరులు చెమటలు చిందించారు.  మెయిన్ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొజిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్యాచింగ్ ప్రాక్టీస్ కూడా చేశారు. ప్లేయర్లు కొత్త ప్రాక్టీస్ జెర్సీలో కనిపించారు.  ఫారిన్ క్రికెటర్లతో పాటు ఇతర స్టార్ ప్లేయర్లు జట్టులో చేరాల్సి ఉంది.