ఉప్పల్ స్టేడియంలో సన్ రోరింగ్ బ్యాటింగ్.. బాల్.. బాల్​కు ఈలలు, కేరింతలు

ఉప్పల్ స్టేడియంలో సన్ రోరింగ్ బ్యాటింగ్.. బాల్.. బాల్​కు ఈలలు, కేరింతలు

 హైదరాబాద్​సిటీ, వెలుగు :  ఉప్పల్ స్టేడియంలో ఆదివారం పరుగుల వరద పారింది. సన్​రైజర్స్ ​హైదరాబాద్, రాజస్థాన్ ​రాయల్స్​ మధ్య జరిగిన ఫస్ట్​మ్యాచ్​లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్యాటర్లు బౌండరీలతో ఫ్యాన్స్​లో జోష్ ​నింపారు. బాల్.. బాల్​కు ఈలలు, కేరింతలతో స్టేడియం హోరెత్తింది. ట్రావిస్ ​హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్​రెడ్డి, క్లాసెన్ ​ఫైరీ షాట్ల​తో రాజస్థాన్ ​ముందు 286 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.

ఉప్పల్ ​స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ​మ్యాచ్​లలో ఇదే హయ్యస్ట్ ​స్కోర్. తర్వాత చేజింగ్​కు దిగిన రాజస్థాన్ ​బ్యాటర్లు సైతం బౌండరీలతో చెలరేగారు. కానీ భారీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. చాలా రోజుల తర్వాత మంచి మ్యాచ్ ​చూశామని క్రికెట్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.