IPL 2025: హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. మార్చి 2 నుంచి SRH ప్రాక్టీస్‌ షురూ

IPL 2025: హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. మార్చి 2 నుంచి SRH ప్రాక్టీస్‌ షురూ

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందుతోంది. ఈసారి ఇప్పల్ స్టేడియం లీగ్ మ్యాచ్‌లతో పాటు ప్లే ఆప్స్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తుండడంతో.. దాన్ని దృష్టిలో ఉంచుకొని స్టేడియాన్ని సరికొత్తగా ముస్తాబు చేస్తున్నట్లు  హెచ్‌సీఏ(HCA) ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌ రావు మీడియాకు తెలిపారు.

గురువారం ANIతో మాట్లాడిన జగన్‌ మోహన్‌ రావు.. రెండు వారాల్లోపు స్టేడియం పునరుద్ధరణ పనులు పూర్తి కానున్నట్లు తెలిపారు. ఈసారి మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇవ్వాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. సీటింగ్ కెపాసిటీ, టాయిలెట్స్ సహా అన్ని రకాల సౌకర్యాలను మెరుగుపరిచినట్లు పేర్కొన్నారు. మార్చి 2 నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తమ సొంత మైదానంలో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు మొదలుపెట్టనున్నట్లు తెలిపారు.

ఈసారి ఉప్పల్ స్టేడియం 9 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఇందులో 7 సన్‌రైజర్స్ హోమ్ మ్యాచ్‌లు కాగా, మరో రెండు క్వాలిఫైయర్ గేమ్స్ ఉన్నాయి.

ఉప్పల్‌లో జరిగే మ్యాచ్‌లు..

  • మార్చి 23: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (మధ్యాహ్నం 3:30)
  • మార్చి 27: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌ (రాత్రి 7:30)
  • ఏప్రిల్ 06: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs గుజరాత్‌ టైటాన్స్‌ (రాత్రి 7:30)
  • ఏప్రిల్ 12: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs పంజాబ్ కింగ్స్ (రాత్రి 7:30)
  • ఏప్రిల్ 23: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs ముంబై ఇండియన్స్ (రాత్రి 7:30)
  • మే 05: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs ఢిల్లీ క్యాపిటల్స్ (రాత్రి 7:30)
  • మే 10: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (రాత్రి 7:30)
  • మే 20: క్వాలిఫయర్‌ 1 (హైదరాబాద్‌, రాత్రి 7:30)
  • మే 21: ఎలిమినేటర్‌ (హైదరాబాద్‌, రాత్రి 7:30)