SRH vs RR IPL 2025: సెంచరీతో శివాలెత్తిన కిషాన్.. రాజస్థాన్‌ టార్గెట్ 287 పరుగులు

SRH vs RR IPL 2025: సెంచరీతో శివాలెత్తిన కిషాన్.. రాజస్థాన్‌ టార్గెట్ 287 పరుగులు

ఉప్పల్ వేదికగా రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటింగ్ లో విరుచుకుపడింది. సొంతగడ్డపై రాజస్థాన్ కు చుక్కలు చూపించింది. వచ్చిన వారు వచ్చినట్టు చితక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. తొలి సారి సన్ రైజర్స్ తరపున ఆడుతున్న ఇషాన్ కిషాన్ 45 బంతుల్లో సెంచరీ చేసి దుమ్ము లేపాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించగా.. క్లాసన్, నితీష్ రెడ్డి రాణించారు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కు ఇది రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఎప్పటిలాగే ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించించింది. తొలి ఓవర్ లోనే 10 పరుగులు.. రెండో ఓవర్ లో 14 పరుగులు వచ్చాయి.. పవర్ ప్లే లో హెడ్, అభిషేక్ శర్మ ధాటికి ఏకంగా 94 పరుగులు రావడం విశేషం. 11 బంతుల్లో 24 పరుగులు చేసి అభిషేక్ శర్మ ఔటైనా.. కిషాన్ తో కలిసి హెడ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. 67 పరుగులు చేసిన తర్వాత హెడ్ ఔట్ కాగా.. నితీష్ రెడ్డి ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. 

ALSO READ : ఇదేం కొట్టుడు సామీ: ఉప్పల్‎లో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ

ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో ఇషాన్ కిషాన్ మాత్రం తన దూకుడు కొనసాగించాడు. బౌండరీలతో విరుచుకుపడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లాసన్ 14 బంతుల్లో 34 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే మూడు వికెట్లు తీసుకోగా.. తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు.