పంజాబ్‌పై సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ

పంజాబ్‌పై సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ
  • శభాష్ నితీశ్.. అదరగొట్టిన తెలుగు కుర్రాడు
  • 2 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఓడిన కింగ్స్‌‌‌‌‌‌‌‌

ముల్లాన్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌:  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో  మరో  తెలుగు కుర్రాడు తన టాలెంట్ చూపెట్టాడు. సన్ రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు ఆడుతున్న 20 ఏండ్ల వైజాగ్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి  (37 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 64; 1/33) బరిలోకి దిగిన రెండో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే  ఖతర్నాక్ ఆటతో ఔరా అనిపించాడు. పేరున్న బ్యాటర్లు ఫెయిలైన వేళ.. కష్టాల్లోపడ్డ జట్టును అద్భుత బ్యాటింగ్​తో ఆదుకున్నాడు. 

దాంతో మంగళవారం  ఆఖరి బాల్‌‌‌‌‌‌‌‌కు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్ రెండు రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో పంజాబ్‌‌‌‌‌‌‌‌ కింగ్స్‌‌‌‌‌‌‌‌పై గెలిచి గట్టెక్కింది. ఆరంభంలో బ్యాటింగ్‌‌‌‌లో.. చివర్లో బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో తడబడినా కీలక సమయాల్లో మెప్పించిన సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ లీగ్‌లో మూడో విజయం అందుకుంది.  తొలుత రైజర్స్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 182/9 స్కోరు చేసింది. నితీశ్ కుమార్ మెరుపు ఫిఫ్టీతో జట్టును ఆదుకున్నాడు. 

మరో యంగ్ స్టర్ అబ్దుల్ సమద్ (12 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లతో 25) కూడా రాణించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్​దీప్ సింగ్‌‌‌‌‌‌‌‌ నాలుగు, హర్షల్ పటేల్, సామ్ కరన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 180/6 స్కోరు చేసి కొద్దిలో విజయాన్ని చేజార్చుకుంది. టాపార్డర్ ఫెయిలైనా శశాంక్ సింగ్ (25 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 46 నాటౌట్‌‌‌‌‌‌‌‌), అశుతోష్ శర్మ (15 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 నాటౌట్‌‌‌‌‌‌‌‌) పోరాడారు. రైజర్స్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో భువనేశ్వర్ రెండు వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌‌‌‌ విన్నింగ్ ఇన్నింగ్స్‌‌‌‌తో పాటు  ఒక వికెట్‌‌‌‌ తీసి, ఓ క్యాచ్ కూడా పట్టిన నితీశ్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది. 

ఇటు అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్.. అటు నితీశ్

టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన హైదరాబాద్ ఇన్నింగ్స్ ఆసక్తికరంగా సాగింది.  ఓవైపు పంజాబ్ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్ పదునైన బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో ఇబ్బంది పెట్టగా.. మరోవైపు రైజర్స్‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ నితీశ్ రెడ్డి హార్డ్‌‌‌‌‌‌‌‌ హిట్టింగ్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు. వరుసగా వికెట్లు పడ్డా నితీశ్ రెడ్డి మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌తో జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌కే ట్రావిస్ హెడ్ (21) ఎల్బీ కోసం పంజాబ్ రివ్యూ వేస్ట్ చేసింది. ఆ ఓవర్లో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన హెడ్..రబాడ వేసిన మూడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో జోరందుకున్నాడు. 

కానీ, తర్వాతి ఓవర్లో మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో హెడ్‌‌‌‌‌‌‌‌తో పాటు మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు డబుల్ షాకిచ్చాడు. కరన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో 6,4 కొట్టిన అభిషేక్ శర్మ (16) మరో షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇవ్వగా.. ఆరో ఓవర్లో హర్షల్ పటేల్ ఒకే పరుగు ఇచ్చాడు. దాంతో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేలో రైజర్స్ 40/3తో నిలిచింది. ఈ దశలో నితీశ్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి (11) జాగ్రత్తగా ఆడుతూ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేశారు. 

కానీ పదో ఓవర్లో త్రిపాఠిని హర్షల్ పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చడంతో రైజర్స్ 66/4తో డీలా పడింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో నితీశ్ ఒక్కసారిగా కౌంటర్ ఎటాక్ చేశాడు. స్పిన్నర్ హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బ్రార్ వేసిన 11వ ఓవర్లో 4,6 కొట్టగా.. హెన్రిచ్ క్లాసెన్ (9) బౌండ్రీ రాబట్టాడు. రబాడ, కరన్‌‌‌‌‌‌‌‌ ఓవర్లలోనూ నితీశ్ ఒక్కో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టి స్కోరు వంద దాటించాడు. అయితే, హర్షల్ వేసిన 14వ ఓవర్లో భారీ షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసిన క్లాసెన్‌‌‌‌‌‌‌‌.. లాంగాఫ్‌‌‌‌‌‌‌‌లో కరన్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అబ్దుల్ సమద్.. అదే ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో ధాటిగా ఆడుతున్న నితీశ్‌‌‌‌‌‌‌‌కు మంచి సపోర్ట్ ఇచ్చాడు. బ్రార్ వేసిన తర్వాతి ఓవర్లో నితీశ్ వరుసగా 4,6,4, 6తో విజృంభించి 32 బాల్స్‌‌‌‌‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 
 

హర్షల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సమద్ మరో రెండు ఫోర్లు కొట్టడంతో రైజర్స్ కోలుకుంది. కానీ, స్లాగ్ ఓవర్లలో మళ్లీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ మరోసారి మూడు బాల్స్ తేడాలో క్రీజులో కుదురుకున్న ఇద్దరు బ్యాటర్లను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి షాకిచ్చాడు. కెప్టెన్ కమిన్స్‌‌‌‌‌‌‌‌ (3) ఫెయిలయ్యాడు. రబాడ స్లో బాల్‌‌‌‌‌‌‌‌కు క్లీన్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్ అయ్యాడు. చివర్లో షాబాజ్ అహ్మద్ (14 నాటౌట్‌‌‌‌‌‌‌‌) విలువైన రన్స్ చేశాడు. అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్ వేసిన 19వ  ఓవర్లో అతను 4, 6 కొట్టగా.. ఇన్నింగ్స్ ఆఖరి బాల్‌‌‌‌‌‌‌‌కుఉనాద్కట్ (6 నాటౌట్‌‌‌‌‌‌‌‌) సిక్స్ బాదడంతో స్కోరు 180 దాటింది.

వణికించిన శశాంక్‌‌‌‌‌‌‌‌, అశుతోష్

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో పంజాబ్ కింగ్స్ తడబడినా చివర్లో హడలెత్తించింది.  పేసర్లు భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమిన్స్‌‌‌‌‌‌‌‌ ఆరంభంలోనే ఆ టీమ్‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టారు. తొలి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భువీ మొయిడిన్‌‌‌‌‌‌‌‌ చేయగా.. రెండో ఓవర్లో  బెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టో (0)ను బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేసిన కమిన్స్‌ ఒకే రన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభ్‌‌‌‌‌‌‌‌సిమ్రన్ (4) భువీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో నితీష్ పట్టిన చురుకైన క్యాచ్‌‌‌‌‌‌‌‌కు వెనుదిరిగాడు. 

భువీ తర్వాతి ఓవర్లోనే  కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాసెన్‌‌‌‌‌‌‌‌ మెరుపు స్టంపింగ్‌‌‌‌‌‌‌‌కు కెప్టెన్ ధవన్‌‌‌‌‌‌‌‌ (14) కూడా వెనుదిరగడంతో పంజాబ్ 20/3తో కష్టాల్లో పడింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో సామ్ కరన్ (29), సికందర్ రజా (28) ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశారు. నితీశ్ ఓవర్లో రజా రెండు ఫోర్లు కొట్టగా..  కరన్‌‌‌‌‌‌‌‌ వెంటవెంటనే రెండు సిక్సర్లతో జోరు పెంచాడు. కానీ, పదో ఓవర్లో బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన నటరాజన్‌‌‌‌‌‌‌‌ తొలి బాల్‌‌‌‌‌‌‌‌కే కరన్‌‌‌‌‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చాడు. 

ఉనాద్కట్, షాబాజ్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సిక్సర్లు కొట్టిన రజా పంజాబ్‌‌‌‌‌‌‌‌ను రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, ఉనాద్కట్ వేసిన 14వ ఓవర్లో  స్లో బాల్‌‌‌‌‌‌‌‌ను ల్యాప్‌‌‌‌‌‌‌‌ షాట్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసి కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. దాంతో  91/5తో పంజాబ్ కష్టాలు మరింత పెరిగాయి. ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన జితేశ్ (19)ను నితీశ్ పెవిలియన్ చేర్చడంతో రైజర్స్‌‌‌‌‌‌‌‌ ఈజీగా గెలిచేలా కనిపించింది. 

కానీ, చివరి 4 ఓవర్లలో 67 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరమైన దశలో  శశాంక్, అశుతోష్‌‌‌‌‌‌‌‌ అనూహ్యంగా చెలరేగారు. భువీ వేసిన 17వ ఓవర్లో  శశాంక్ మూడు ఫోర్లతో పంజాబ్‌‌‌‌‌‌‌‌ను రేసులోకి తెచ్చాడు. కమిన్స్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో అశుతోష్ రెండు ఫోర్లు కొట్టాడు. నట్టూ వేసిన 19వ ఓవర్లో శశాంక్‌‌‌‌‌‌‌‌, అశుతోష్‌‌‌‌‌‌‌‌ చెరో ఫోర్ రాబట్టడంతో చివరి ఆరు బాల్స్‌‌‌‌‌‌‌‌లో 29 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం అయ్యాయి. ఆఖరి ఓవర్‌‌ తొలి బాల్‌‌‌‌‌‌‌‌కే అశుతోష్  సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టగా.. ఉనాద్కట్ వరుసగా రెండు వైడ్స్ వేశాడు. రెండో బాల్‌‌‌‌‌‌‌‌కూ అశుతోష్ సిక్స్ రాబట్టాడు. ఈ రెండు సిక్సర్లు ఫీల్డర్ల చేతుల్లో నుంచి లైన్ అవతల పడ్డాయి. దాంతో సమీకరణం 4 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 15 రన్స్‌‌‌‌‌‌‌‌గా మారి ఆటలో ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. కానీ, మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌కు ఆరు రన్స్ ఇచ్చిన ఉనాద్కట్ రైజర్స్‌‌‌‌‌‌‌‌ ను కాపాడాడు. లాస్ట్ బాల్‌‌‌‌‌‌‌‌కు శశాంక్ సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టినా ఫలితం లేకపోయింది.