జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో సన్ రైజర్స్ ప్లేయర్లు

జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో సన్ రైజర్స్ ప్లేయర్లు

కోల్ కతా నుంచి హైదరాబాద్ చేరుకున్న  సన్ రైజర్స్  ప్లేయర్లు అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించారు.  ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించి శాలువాతో సత్కరించారు. అర్చకులు పూజల అనంతరం ఆశీర్వదించారు. 

జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండటంతో అమ్మవారి ఆశీర్వాదం కోసం వీళ్లు  ఆలయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  SRH కప్ గెలిచేలా ఆశీర్వదించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

►ALSO READ | CSK vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. రెండు మార్పులతో చెన్నై

ఐపీఎల్ 18 సీజన్ లో ఇప్పటి వరకు 4 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్  మూడింటిలో ఓడి ఒక్క మ్యాచ్ లో గెలచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఏప్రిల్ 6న  హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో  గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది సన్ రైజర్స్ టీం.