
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహించబోతున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)కు సపోర్ట్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తెలిపింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ సీఈఓ షణ్ముగం, డైరెక్టర్ కిరణ్, హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల ఏర్పాట్లపై చర్చించారు. ఉప్పల్ సమీపంలో మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటుకు సాయం చేయాలని జగన్ కోరగా సానుకూలంగా స్పందించారు.