- మూడు రోజులుగా ప్రచారానికి దూరం
- హైదరాబాద్‌లోని ఇంట్లో విశ్రాంతి
నల్గొండ, వెలుగు : రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డికి వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన మూడు రోజుల నుంచి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌లో ఆయన నివాసంలోనే రెస్ట్ తీసుకుంటుండగా, ఆయన వ్యక్తిగత డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం హుజూర్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్అలసటగా ఉందని ప్రచారం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. వడదెబ్బ తాకడంతో అప్పటి నుంచి వ్యక్తిగత డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఉత్తమ్ బదులుగా ఆయన భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తమ్ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలోనే ప్రచారంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు.