
దోసకాయ చట్నీలో అదిరిపోయే రుచితో 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. .
దోసకాయ చట్నీ తయారీకి కావాల్సినవి
- దోసకాయ : ఒకటి (పెద్దది)
- ఎండుమిర్చి : నాలుగు
- నూనె : సరిపడా
- , జీలకర్ర : అర టీ స్పూన్
- ఆవాలు : పావు టీ స్పూన్
- ఉప్పు : తగినంత
- వెల్లుల్లి రెబ్బలు : ఐదు లేదా ఆరు
- కారం : ఒక టేబుల్ స్పూన్
- పసుపు : పావు టీ స్పూన్
- కొత్తిమీర తరుగు : ఒక టేబుల్ స్పూన్
- కరివేపాకు : ఒక రెమ్మ
- జీలకర్ర- మెంతుల పొడి : పావు టీ స్పూన్
తయారీ విధానం : దోసకాయ చేదు చూసి చెక్కు తీసి ముక్కలు తరగాలి. పాన్లో నూనె వేడిచేశాక జీలకర్ర, ఆవాలు వేయాలి. అందులోనే ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అవన్నీ వేగాక స్టవ్ ఆపేయాలి. నూనె కొద్దిగా చల్లారాక ఉప్పు, కారం వేసి కలపాలి. తర్వాత దోసకాయ ముక్కలు, జీలకర్ర మెంతుల పొడి వేయాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. దోసకాయ పచ్చడిని జాడీ లేదా సీసాలో నిల్వ చేయాలి. వేడివేడి అన్నంలో తింటే, ఈ పచ్చడి రుచి అదిరిపోతుంది.