మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో సినిమా ఓటీటీ అప్డేట్ బయటికి వచ్చింది. డిసెంబర్ 20న రిలీజైన ఈ మూవీ 2024 డిసెంబర్ చివర్లో మలయాళంలో సూపర్ హిట్ అయింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. వారం రోజుల్లోనే రూ.75 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
అయితే ఈ మార్కో సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ స్పెషల్గా జనవరి 1న రిలీజ్ గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన విజువల్స్కి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇందులో ఉన్న యాక్షన్స్ ఎక్కువగా కేజీఎఫ్ సినిమాని తలపిస్తున్నాయి. దీంతో తెలుగు ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే మార్కో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం.. థియేటర్స్లో రిలీజైన 45 రోజుల తర్వాతనే వచ్చే ఛాన్స్ ఉంది. అంటే, జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఓటీటీలోకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఎప్పుడొచ్చినా ఆడియన్స్కి మాస్ ట్రీట్ కన్ఫమ్ అనే చెప్పాలి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
Also Read :- అన్‌స్టాపబుల్ సెట్లో అడుగుపెట్టిన రామ్‌చరణ్
ఈ సినిమాకు హనీఫ్ అదేని దర్శకత్వం వహించాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు. తరేజా హీరోయిన్ గా నటించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు కబీర్ దుహన్ సింగ్ విలన్ గా నటించాడు. మలయాళ ప్రముఖ సినీ నిర్మాత షరీఫ్ మహమ్మద్ క్యూబ్స్ ఎంటర్టైంన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించాడు. తెలుగులో ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటెడ్ సంస్థ ఎన్వీఆర్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది.