- పవర్ రేంజర్స్‌లా గాయాలు మాన్పే టెక్నాలజీపై యూఎస్ ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్
యుద్ధాలు, యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సైనికులకు తీవ్రమైన గాయాలవుతుంటాయి. అవి తగ్గడానికి చాలా రోజుల టైమ్ పడుతుంది. కొన్ని సార్లు కండరాలు బయటపడి, ఆ గాయాలు మాని సైనికులు మళ్లీ ఫిట్ అవ్వడానికి నెలల సమయం గడిచిపోతుంది. ఇక స్పేస్‌లోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్‌కి పొరబాటున ఏవైనా గాయాలైతే వాటి వల్ల చాలా ఇబ్బందిపడతారు. అందుకే ముఖ్యంగా ఆస్ట్రోనాట్స్, సోల్జర్స్‌ని దృష్టిలో పెట్టుకుని యూఎస్ ఎయిర్ ఫోర్స్ ప్రయోగాలు మొదలుపెట్టింది. ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్, మరికొన్ని విభాగాలు కలిసి సెల్యూలార్ రీప్రోగ్రామింగ్‌పై రీసెర్చ్ షురూ చేశారు. ఈ ప్రయోగాల్లో ఎక్స్‌పర్ట్ అయిన యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్ కంప్యుటేషన్ మెడిసిన్, బయో ఇన్ఫర్మేటిక్, మ్యాథమేటిక్స్ ప్రొఫెసర్ ఇండికా రాజపక్సే, ఆయన టీమ్‌తో యూఎస్ ఎయిర్ ఫోర్స్ సైంటిస్టులు కొలాబరేట్ అయ్యారు. రాజపక్సే నేతృత్వంలో కొనసాగుతున్న ప్రయోగాల్లో మంచి రిజల్ట్ కనిపిస్తోంది.
‘ట్రాన్స్‌క్రిప్షనల్ ప్రొటీన్స్’తో జీన్ మాడిఫికేషన్
మన శరీరంలో ఉండే ఏదైనా ఒక సెల్ (కణం)ను జీనోమ్ టెక్నాలజీ ద్వారా మాడిఫై చేయొచ్చు. ఒక కణంలోని రకరకాల జీన్స్ వేర్వేరు పనులు చేస్తాయి. వాటిలో కొన్ని సెల్ డివిజన్, సెల్ గ్రోత్, సెల్ మైగ్రేషన్ వంటి వాటికి కారణమవుతాయి. ఇలా జరిగే ఈ పనులను ఆన్, ఆఫ్ చేసే ట్రాన్స్‌క్రిప్షనల్ ఫ్యాక్టర్ ప్రొటీన్స్ సాయంతో సెల్ రీప్రోగ్రామింగ్ చేయొచ్చు. ఈ ట్రాన్స్‌క్రిప్షనల్ ఫ్యాక్టర్స్‌నే ‘స్ప్రేయాన్’ బ్యాండేజ్‌లోకి తెచ్చి, దాని ద్వారా గాయాలను మాన్పించాలన్నది సైంటిస్టుల స్ట్రాటజీ. అయితే ఏ స్టేజ్‌లో ఆ సెల్యులార్ మాడిఫికేషన్ ఆగేలా చేయాలనేదే అసలైన టాస్క్.
లైవ్ సెల్ ఇమేజింగ్ మైక్రోస్కోప్ సాయంతో..
గాయం మానే దశలో కణాల్లో జరిగే మార్పులను కచ్చితంగా అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్‌క్రిప్షనల్ ఫ్యాక్టర్స్‌ను ఎలా వాడుకోవాలన్న దానిపై క్లారిటీ వస్తుంది. ఇందుకోసం లైవ్ సెల్ ఇమేజింగ్ మైక్రోస్కోప్ అవసరమవుతుంది. ఈ విషయాన్ని ప్రొఫెసర్ ఇండికా రాజపక్సే యూఎస్ ఎయిర్ ఫోర్స్ సైంటిస్టులకు తెలియజేయగానే వెంటనేఅందుబాటులోకి తెచ్చారు. దీని సాయంతో సెల్ లోపల జరిగే మార్పులను హైరెజల్యూషన్‌లో చూడొచ్చు. కండరాలకు అయిన గాయాలను మాన్పించే ప్రాసెస్‌లో ఏ దశలో పై పొర చర్మంలా మారాలన్న దానిపై రాజపక్సే ఒక అల్గరిథమ్‌ను రూపొందించారు. దీని సాయంతో అదే ఫార్మాట్‌లో జీన్ మాడిఫికేషన్ చేసి సెల్ రీప్రోగ్రామింగ్ పూర్తి చేశామని ఆయన చెప్పారు. సాధారణంగా ఈ తరహా బయో సైన్స్ లింక్డ్ మ్యాథమెటికల్ మోడల్ రీసెర్చ్‌కు దశాబ్దాల సమయం పడుతుందని, రాజపక్సే టీమ్ దీనిని నాలుగైదేండ్లలోనే పూర్తి చేయడం గ్రేట్ అని యూఎస్ ఎయిర్ ఫోర్స్ హ్యూమన్ పెర్ఫాపెన్స్ వింగ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ రాజేశ్ నాయక్ అన్నారు. భవిష్యత్తులో సోల్జర్స్, స్పేస్ ఆస్ట్రోనాట్స్, ఎయిరో మెడికల్ అవసరాలకు ఈ వూండ్ హీలింగ్ మెథడ్ ఎంతగానో ఉపయోగపడనుందని ఆయన అభిప్రాయపడ్డారు.
నార్మల్ కంటే ఐదింతల వేగంగా..
సెల్యులార్ రీప్రోగ్రామింగ్ ద్వారా పెద్ద పెద్ద గాయాలైనా వేగంగా మాన్పించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జినోమ్ మాడిఫికేషన్స్ చేసి తయారు చేసే ‘స్ప్రేయాన్ బ్యాండేజ్’ను గాయమైన మజిల్‌పై నేరుగా అంటిస్తే, ఆ పైభాగం స్కిన్ సెల్‌గా మారిపోతుంది. దీంతో ఎక్కువ రోజులు పుండు పడే చాన్స్ లేకుండా పోతుంది. సాధారణంగా గాయం మానే టైమ్ కంటే ఐదింతల ఫాస్ట్‌గా ఆ భాగం నార్మల్ అయిపోతుంది. కాలిన గాయాలకు కూడా ఇది పని చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
సౌదీ చరిత్రలో మొదటిసారి.. ఆర్మీలోకి మహిళలు