హైడ్రాకు ప్రజల నుండి సూపర్ రెస్పాన్స్.. మంత్రి పొన్నం ప్రభాకర్

హైడ్రాకు ప్రజల నుండి సూపర్ రెస్పాన్స్.. మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‎ పరిధిలో హైడ్రా చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ముందు రాజధాని నగరంలో, తరువాత అన్ని జిల్లాల్లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయో వివరాలు సేకరించి వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం నుండి వాతావరణాన్ని  పరిరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గతంలో ఉన్న చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. 

తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పరిరక్షించుకోవాలని స్వచ్ఛంద సంస్థలకు, గతంలో ఇక్కడ చెరువు ఉండే అని తెలిసిన  వారు స్థానికులు ఎవరైనా పోలీసు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే పని.. చెరువుల పరిరక్షణ స్థానికులదేనని అన్నారు. ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు లేదని తేల్చి చెప్పారు. హైడ్రాకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది.. ప్రభుత్వం చేస్తున్న పనిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్శిస్తున్నారన్నారు. 

Also Read:- FTL, బఫర్ జోన్ పరిధిలోని అనుమతులపై ఆరా..

ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే న్యాయ స్థానాలు ఉన్నాయని అన్నారు. చెరువుల పరిరక్షకులు అందరూ ఎక్కడెక్కడ అక్రమణకు గురయ్యాయో వాటి ఆధారాలు సంబంధిత అధికారులకు ఇవ్వాలన సూచించారు. 33 జిల్లాల్లో ఎక్కడైనా గ్రామాలు, మండలాలు,పట్టణాలు, మున్సిపాలిటీ  చెరువులు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాల్లో మీకు ఉన్న అవగాహన, ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తీసుకురండని పిలుపునిచ్చారు. ప్రజలంతా ఈ కార్యక్రమం లో భాగస్వామ్యం కావాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్.