సూపర్​ సింగర్​ గ్రాండ్ ఫినాలె

సూపర్​ సింగర్​ గ్రాండ్ ఫినాలె

తెలుగు ఆడియెన్స్​కి ఈ ఆదివారం నిజంగా పాటల పండుగే అని చెప్పాలి. ఎందుకంటే... ‘సూపర్ సింగర్ జూనియర్’ రియాలిటీ షో టైటిల్ విన్నర్​ ఎవరో ఆ రోజే తెలుస్తుంది. దాదాపు మూడు నెలలుగా పాటలు పాడుతూ ఎంటర్​టైన్ చేస్తున్న కంటెస్టెంట్స్​లో ఐదుగురు ఫైనల్​కి వెళ్లారు.  గ్రాండ్ ఫినాలె ఎపిసోడ్​ని చాలా గ్రాండ్​గా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వచ్చింది. అందులో స్పెషల్ గెస్ట్​గా నాగార్జున కనిపించాడు. విజేతగా నిలిచిన వాళ్లకు ఆయన ట్రోఫీ అందించనున్నాడు. చాలా రోజుల తర్వాత  టీవీ రియాలిటీ షో ఫినాలెకి స్పెషల్​ గెస్ట్​గా వస్తున్నాడు నాగార్జున. అంతేకాదు కామెడీ కింగ్ బ్రహ్మానందం, హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతి శెట్టి కూడా గెస్ట్​లుగా వస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంది.

కపిల్​ శర్మ షో మళ్లీ షురూ
సెలబ్రిటీలతో కలిసి మళ్లీ ఆడియెన్స్​ని నవ్వించేందుకు కమెడియన్ కపిల్​ శర్మ రెడీ అవుతున్నాడు.  రెండు రోజుల కిందటే ముంబైలో ‘ది కపిల్ శర్మ’ కామెడీ షో కొత్త సీజన్​  షూటింగ్ మొదలైంది. అక్షయ్​ కుమార్​ ఫస్ట్ గెస్ట్. ఫస్ట్ ఎపిసోడ్​లో రకుల్​ప్రీత్ సింగ్​ కూడా కనిపించనుంది. ఆడియెన్స్​కి మరింత ఫన్​ ఇచ్చేందుకు ఈసారి కొన్ని మార్పులతో షోని డిజైన్ చేస్తోంది సోనీ టీవీ. పోయిన సీజన్​లో స్వప్నగా ఆడియెన్స్​ని ఎంటర్​టైన్ చేసిన కృష్ణ అభిషేక్​ ఈ సీజన్​ నుంచి తప్పుకున్నాడు. దాంతో కొత్త ఆర్టిస్టుల్ని చూడొచ్చు. ఈ షో సోని టీవీలో టెలికాస్ట్ కానుంది. అయితే, ఏ రోజు నుంచి టెలికాస్ట్ అవుతుందనేది మాత్రం అనౌన్స్​ చేయలేదు.