
తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం రచించిన” Selfie of Success ” పుస్తకం ఇప్పటికే దేశ, విదేశాలలో ఎంతో మంది పుస్తక ప్రియుల విశేష ఆదరణ పొంది అమెజాన్ ఆన్ లైన్ అమ్మకాలలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ” Selfie of Success ” పుస్తకం ను చదివి తన అనుభవాలను Twitter, Facebook, Instagram లలో పోస్ట్ చేశాడు.ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకంగా మహేశ్ అభివర్ణించాడు. గెలుపు తరువాత జరిగే పరిణామాలపై పుస్తకంలో సమగ్రంగా చర్చించారని అన్నాడు.
‘విజయం మనిషి జీవితంలో ఒక ప్రయాణం’ గా ఉండాలని వివరంగా తన అభిప్రాయాలను వెల్లడించిన బుర్రా వెంకటేశంకు అభినందనలంటూ మహేష్ బాబు తన ట్వీట్ లో తెలిపాడు.
#SelfieofSuccess – An Amazon bestseller https://t.co/lQJK6m20q7 pic.twitter.com/oOSwiUHjdX
— Mahesh Babu (@urstrulyMahesh) August 2, 2019