సర్కారు వారి పాట సినిమాతో మహేశ్ మరో రికార్డు

  • నాలుగోసారి 100కోట్ల షేర్ మార్కును అందుకున్న సూపర్ స్టార్
  • సర్కారు వారి పాట సినిమాతో మరోసారి రికార్డు
  • ఆల్ టైం ఎపిక్ రికార్డును నమోదు చేసిన మహేశ్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే  కెరీర్ లో ది బెస్ట్ హీరో బ్రాండ్ తో దూసుకు పోతున్న మహేశ్ కు... ఈ సినిమా మరో అద్భుత విజయాన్ని అందించింది.  బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి బాక్ టు బాక్ ఎపిక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత మాంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో భరత్ అనే నేను సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అదే ఉత్సాహంతో సాగిన మహేశ్ తర్వాతి చిత్రం మహర్షి మూవీ కూడా రికార్డులను బద్దలు కొట్టి విజయ దుందుభి మోగించింది. 

ఇకపోతే సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని.. హాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సూపర్ స్టార్... ఇప్పుడు సర్కారు వారి పాట చిత్రంతో అభిమానులను మరో సారి అలరించారు. ఇదిలా ఉండగా ఈ మూవీ ముందు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని, రోజుకో రికార్డ్ బ్రేక్ చేస్తున్న ఈ తరుణంలో... తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకొని మహేశ్ బాబు స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లింది. 

ఇక వివరాల్లోకి వెళితే..... బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు రూ.100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దులిపారు మహేష్ బాబు. తన కెరీర్ లో నాలుగో సారి 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలన తిరుగులేని రికార్డ్ ను నమోదు చేసి, తన సత్తా చాటారు. తెలుగు సినీ చరిత్రలో ఇలా 4 సార్లు రీజనల్ మూవీస్ తో 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి చరిత్రలో నిలిచారు సూపర్ స్టార్.  భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఇప్పటికే 100 కోట్ల మార్క్ ని అందుకోగా.. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాతో నాలుగోసారి 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇదిలాగే కొనసాగితే మహేశ్ మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా 4 సార్లు 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఇలాంటి రికార్డ్ ను నమోదు చేయడంపై  మహేశ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తల కోసం...

హాస్పిటల్లో డిప్లొమా పట్టా

రాజస్థాన్ ప్లేయర్ల కేకలు.. ఫ్లైట్‌లో దట్టమైన పొగమంచు