టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి బుధవారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకన రాత్రి 7.30 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. చివరిమెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. గురువారం వేకువజాము శ్రీవారికి నిర్వహించే మేల్కొలుపు సేవా సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు.ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సర్త్కరించారు. సంప్రదాయ వస్త్రధారణలో గౌతమ్ ఆకట్టుకోగా... నమ్రతా, సీతారలు సింప్లిసిటీతో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.