Mahesh Babu: కల్కి ఓ అద్భుతం..డైరెక్టర్ నాగ్‌ విజన్‌కు హ్యాట్సాఫ్‌: మహేశ్‌ బాబు వరుస ట్వీట్స్

Mahesh Babu: కల్కి ఓ అద్భుతం..డైరెక్టర్ నాగ్‌ విజన్‌కు హ్యాట్సాఫ్‌: మహేశ్‌ బాబు వరుస ట్వీట్స్

కల్కి(Kalki 2898 AD) సినిమా..కాశీ,కాంప్లెక్స్,శంభాల అనే మూడు వేరు వేరు ప్రపంచాలతో తెరకెక్కి అద్భుతమైన విజయం సాధించింది. 3000 ఏళ్ళ తర్వాత కాశీ నగరం ఎలా ఉటుంది? అక్కడ మనుషులు, వారి జీవన విధానం ఎలా ఉంటుందనే దానిపై చాలా రీసర్చ్ చేసి నాగ్ అశ్విన్ ఒక కళాకండాన్ని ప్రేక్షకుల ముందుంచారు.

ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.విజువల్స్,గ్రాఫిక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని, దర్శకుని ఊహకు, దాన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానానికి టాప్ టెక్నీషియన్స్ సైతం ఫిదా అవుతున్నారు.ఇక ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్రాప్ గా తీసుకొని దానికి ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ పొగిడేస్తున్నారు.

తాజాగా స్టార్‌ హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) ట్విట్టర్ ఎక్స్ వేదికగా కల్కి టీమ్‌కు బెస్ట్ విషెష్ చెప్పారు. తనదైన శైలిలో మూవీపై రివ్యూ ఇస్తూ..ఈ మేరకు సినిమా సాంకేతిక టీమ్ కి, డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కి విషెష్ తెలిపారు.

ALSO READ | Kalki 2898 AD Box Office Day 11: కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 900 కోట్లు..మరి ఇండియా వైడ్ ఎంతంటే?

"కల్కి ఓ అద్భుతం..జస్ట్‌ వావ్‌.డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) విజన్‌కు హ్యాట్సాఫ్‌.తెరకెక్కించిన ప్రతి ఫ్రేమ్‌ ఓ కళాఖండంలా ఉంది.అమితాబ్‌ బచ్చన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌కు ఎవరూ సరితూగరు.కమల్‌ హాసన్‌ సర్ తన ప్రతి పాత్రకు జీవం పోశారు. హీరో ప్రభాస్‌ గొప్ప క్యారెక్టర్‌లో చాలా సులభంగా నటించారు.దీపిక ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించారు.ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతీ మూవీస్‌కు అభినందనలు"అని రాసుకొచ్చారు.ఈ పోస్ట్‌కు డైరెక్టర్ నాగ్..ధన్యవాదాలు తెలుపుతూ..‘మీ బెస్ట్ విషెష్ అందుకోవడం మా టీమ్‌కు ఆనందంగా ఉంది’అని అన్నారు.ఇక నిర్మాణసంస్థ వైజయంతి మూవీస్ కూడా మహేశ్‌కు థ్యాంక్స్‌ చెప్పింది.

వైజయంతీ మూవీస్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ జున్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్ప‌టికే రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబ‌ట్టి రూ.1000 కోట్ల మార్క్‌కు ద‌గ్గ‌ర‌గా వెళుతుంది.ఇంకా చూడని వారుంటే..ఈ అద్భుత కళాకండాన్ని చూసి మైథాలజీ హిస్టరీ తెలుసుకోండి.