మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మహేష్ బాబు రియాక్షన్ ఇది..

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మహేష్ బాబు రియాక్షన్ ఇది..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి  తెలిసిందే. సమంతను ఉద్దేశిస్తూ సురేఖ చేసిన వ్యాఖ్యలను టాలీవుడ్ వర్గాలు మూకుమ్మడిగా ఖండించాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని.. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా.. ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యానంటూ ఎక్స్ లో ట్వీట్ ద్వారా స్పందించారు మహేష్ బాబు. 

ALSO READ | మంత్రి కొండా సురేఖ V/s సినీ ఇండస్ట్రీ..

ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్‌స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చని.. మీరు చేసిన చౌకబారు మరియు నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్‌లోని వ్యక్తులను అభ్యర్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు మహేష్ బాబు.మన దేశంలోని మహిళలను మరియు మన సినీ సోదరులను చాలా గౌరవంగా చూడాలని ఎక్స్ లో ట్వీట్ చేశారు మహేష్.

ఇదిలా ఉండగా... సమంతను ఉద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి సురేఖ. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు కొండా సురేఖ.