
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Laal Salaam). రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinikanth) తెరకెక్కించిన ఈ సినిమాలో విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్(Vikranth) హీరోలుగా కనిపించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందించాడు. విడుదలకు ముందే పలు వివాదాలకు దారి తీసిన లాల్ సలామ్ మూవీపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక టీజర్, ట్రైలర్ రిలీజ్ తరువాత ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూశారు.
ఇక భారీ అంచనాల మధ్య లాల్ సలామ్ సినిమా నేడు(ఫిబ్రవరి 9) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఓవర్ సీస్ తో సహా చాలా చోట్ల మొదటి షోలు పూర్తవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వైదికగా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. మరి సూపర్ స్టార్ ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్ లాల్ సలామ్ సినిమా గురించి ఏమంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Eagle Movie X Review: ఈగల్ మూవీ ఎలా ఉంది.. ఆడియన్స్ ఏమంటున్నారు?
#LalSalaam 2nd Half ????
— ?????? ?????? ??? (@AllariRamuduNTR) February 9, 2024
A Tribute Film To All The Muslim Friends #Thalaivar Getup ???♂️
We Won @ash_rajinikanth Akka ?
Social Message Was Very Well Told #LalSalaamFDFS #SuperstarRajinikanth pic.twitter.com/CdXZenCnzt
లాల్ సలామ్ సినిమా గురించి ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వస్తోంది. అయితే చాలా మంది ఈ సినిమా చాలా గొప్పగా ఉందని చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మతసామరస్యం కాన్సెప్ట్ ప్రతీ ఒకరికి కనెక్ట్ అవుతుందని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాల్ అటు ఇటుగా ఉన్నా.. సెకండ్ హాఫ్ నిలబెట్టింది చెప్తున్నారు. ఇక మొయిద్దీన్ భాయ్ గా రజినీకాంత్ అదరగొట్టేశారని, ఆయన పాత్రే సినిమాకుక్ కీలకంగా నిలిచిందని, ఆ పాత్ర నేపధ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయని కామెంట్స్ చేస్తున్నారు.
Unexpected ? THALAIVAR Entry #LalSalaam pic.twitter.com/TKSzbzSfm8
— ???????? (@enish_7) February 9, 2024
అయితే.. మరికొందరేమో తీసుకున్న కథ బాగానే ఉన్నా.. చూపించిన విధానం బాగోలేదని, అసలు ఇద్దరు హీరోల మధ్య వచ్చే సన్నివేశాలు ఒకదానికొకటి కనెక్షన్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. చాలా డెప్త్ అండ్ పవర్ ఫుల్ కథని అంతే పవర్ ఫుల్ తెరకెక్కించడంలో ఐశ్వర్య కాస్త తడబడ్డారని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఓవరాల్ గా సినిమా ఎలా ఉందని తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
#LalSalaam Good watch! Strong story, ok screenplay and powerful climax. ARR songs are wonderful. #Thalaivar as usual rocks. Valiant attempt by the newbie director #AishwaryaRajinikanth ??????#LalSalaamFDFS #RegalTimesSquare #LalSalaamUSA@LycaProductions
— Kodes (@KodesOn) February 9, 2024