ఇష్క్ రీ రిలీజ్‌‌‌‌కు సూపర్బ్ రెస్పాన్స్

ఇష్క్ రీ రిలీజ్‌‌‌‌కు సూపర్బ్ రెస్పాన్స్

నితిన్ కెరీర్‌‌‌‌లో ‘ఇష్క్’ మూవీ స్పెషల్. విక్రమ్ కె కుమార్ రూపొందిన ఈ మూవీ పన్నెండేళ్ల క్రితం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా నవంబర్ 30న  ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు.  ఏపీ, తెలంగాణ‌‌‌‌, బెంగుళూరుల్లో 65కి పైగా థియేట‌‌‌‌ర్స్‌‌‌‌లో రీ రిలీజ్ చేయ‌‌‌‌గా అన్నిచోట్ల హౌస్‌‌‌‌ఫుల్ కావ‌‌‌‌టం సంతోషంగా ఉందని నిర్మాత సుధాకర్ రెడ్డి చెప్పారు. 

 నితిన్‌‌‌‌, ద‌‌‌‌ర్శకుడు విక్రమ్, నిర్మాత సుధాక‌‌‌‌ర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సుద‌‌‌‌ర్శన్ 35 ఎంఎం థియేట‌‌‌‌ర్‌‌‌‌కు వెళ్లి ఆడియెన్స్‌‌‌‌తో క‌‌‌‌లిసి సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌‌‌‌ట‌‌‌‌మే కాకుండా మూవీలోని ఓ పాట‌‌‌‌కు ఆడియెన్స్‌‌‌‌తో క‌‌‌‌లిసి డ్యాన్స్ కూడా చేశారు.