సీపీఆర్ తో ప్రాణాలు కాపాడవచ్చు : జీవన్

సీపీఆర్ తో ప్రాణాలు కాపాడవచ్చు : జీవన్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారిని సీపీఆర్​ ద్వారా బతికించవచ్చని జనరల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ జీవన్ అన్నారు. గురువారం ఆస్పత్రిలో సీపీఆర్ పై  వైద్య బృందానికి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా హెచ్ వోడీ డాక్టర్ అమరావతి హార్ట్​స్ట్రోక్​ వచ్చిన వ్యక్తికి సీపీఆర్ లో భాగంగా చేసే 8 విధానాలపై వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ నజ్మా, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ అలీ ఖాన్, ఆర్ఎంఓ లు - డాక్టర్ దుర్గ, డాక్టర్ శ్వేత,  తదితరులు పాల్గొన్నారు.