- ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
మేళ్లచెరువు(హుజూర్ నగర్), వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించే ముత్యాలమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. జాతర భద్రత ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్ లను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా తగు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎస్పీ వెంట కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐ చరమందరాజు, ఎస్ఐ ముత్తయ్య తదితరులు ఉన్నారు.