చాక్లెట్ దొంగిలించాడని బాలుడిని చిత్రహింసలు పెట్టిన సూపర్ మార్కెట్ యాజమాన్యం

చాక్లెట్ దొంగిలించాడని  బాలుడిని చిత్రహింసలు పెట్టిన సూపర్ మార్కెట్ యాజమాన్యం

చాక్లెట్ దొంగిలించాడనినే కారణంతో ఓ బాలుడిని బంధించి  చితకబాదింది సూపర్ మార్కెట్ యాజమాన్యం.  మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చిత్రహింసలు పెట్టింది. దెబ్బలు తాళలేక ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది.

నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తిప్పలమడుగు గ్రామానికి చెందిన ఆరురి శివ(14) రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామంలోని ఎంజేపీటీసీ ( మహాత్మా జ్యోతిభా ఫూలే గురుకుల పాఠశాల) లో 9వ తరగతి చదువుతున్నాడు. ఏప్రిల్ 1 న మధ్యాహ్నం స్కూల్ నుంచి ఎవరికి చెప్పకుండా ఇబ్రహీంపట్నంలోని మెగా డీమార్ట్ కి మధ్యాహ్నం వెళ్ళాడు. అక్కడ బాలుడు ఒక చాక్లెట్ దొంగిలించడాన్ని గమనించిన మెగా డీ మార్ట్ యాజమాన్యం, సిబ్బంది నలుగురు   మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చితకబాదారు. 

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. తనపై విచక్షణా రహితంగా దాడి చేశారని.. ఉప్పు నోట్లో కుక్కి పైపులతో నలుగురు కొట్టారు. చంపుతామని బెదిరించారు. తర్వాత  స్పృహ కోల్పోయానని చెప్పాడు బాలుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. .