SSMB29: రాజమౌళి సినిమా కోసం గ్లోబ్ ట్రోటింగ్ కటౌట్.. మతిపోగొడుతున్న మహేష్ లేటెస్ట్ స్టిల్స్

SSMB29: రాజమౌళి సినిమా కోసం గ్లోబ్ ట్రోటింగ్ కటౌట్.. మతిపోగొడుతున్న మహేష్ లేటెస్ట్ స్టిల్స్

హై-వోల్టేజ్ యాక్షన్‌ అండ్ అడ్వెంచరస్  థ్రిల్లర్‌ ఎంటర్టైనగా  తెరకెక్కినున్న SSMB29 కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సిద్దమవుతున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ సరికొత్తగా మేకోవర్తో ఫ్యాన్స్కి కిక్ ఇచ్చేస్తున్నాడు.

లాంగ్ హెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కనిపిస్తున్న మహేష్.. మీసాలు పెంచి, లైట్ గడ్డంతో ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు. ఇప్పటికే మహేష్ కి సంబంధించిన కొత్త లుక్ ఫొటోస్ వైరల్ అవ్వగా ఆడియాన్స్ను తెగ ఆకట్టుకున్నాయి.

లేటెస్ట్గా హైదరాబాదు విమానాశ్రయంలో మహేష్ - నమ్రత కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లారు. ఈ లేటెస్ట్ లుక్లో  మహేష్ లాంగ్ హెయిర్తో, కళ్లద్దాలు, టోపీ ధరించి ఉన్న ఫొటోస్తో మరోసారి సూపర్ ఫ్యాన్స్కి పిచ్చెక్కించేస్తున్నాడు.

'గ్లోబ్‌ట్రోటింగ్ కటౌట్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైల్'..అలాగే కొత్త లుక్ లో మహేష్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాడని, హాలీవుడ్ హీరోలను సైతం పక్కకు నెట్టేసేలా ఉన్నాడని, 'కొంతమంది హీరోలు బాడీ లు పెంచి డైట్ లు చేసి ఫేస్ కి ఏదేదో చేస్తే కానీ అందంగా కనిపించరు. నువ్వేమో T- షర్ట్ లు ,హూడీలు వేసుకొని వాళ్ళని తగలబెట్టేస్తున్నావ్.. ఎంధయ్యా ఇది'.. అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మహేష్ వెళ్ళేది వెకేషన్ కా, అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికా లేదా రాజమౌళి సినిమా వర్క్ కోసమా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం మహేష్ లేటెస్ట్ లుక్కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి 


ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుకు సంబందించిన చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం..SSRMB29 ఈ నెల లాస్ట్ వీక్ నుండి యూనిట్ సభ్యులు అందరు వర్క్ షాప్ లో పాల్గొంటారని టాక్. డిసెంబరు నుండి పక్కాగా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ను విదేశాల్లో మొదలెట్టనున్నారు. ఫారిన్ లోని అడవులలో భారీ చేజింగ్ సిక్వెన్స్ ను షూట్ చేయనున్నారు రాజమౌళి.

కాగా ఈ సినిమా తరువాత టాలీవుడ్ హాలీవుడ్ రేంజ్కి వెళ్తుందని, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అవడం ఖాయమని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. మరి భారీ అంచనాల మధ్య మొదలవుతున్న ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచనాలు క్రియేట్ అవుతుందా అనేది చూడాలి.