Rajinikanth: ఆసుపత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్‌ డిశ్చార్జ్‌..

Rajinikanth: ఆసుపత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్‌ డిశ్చార్జ్‌..

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తీవ్ర కడుపునొప్పితో సోమవారం (సెప్టెంబర్ 30న) అర్థరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌కు కార్డియాక్ క్యాథ్ ల్యాబ్‌లో ముగ్గురు వైద్య నిపుణుల బృందం శస్త్రచికిత్స చేసి స్టెంట్‌ వేశారు. మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉన్న రజనీకాంత్ గురువారం అక్టోబర్ 3 తేదీ రాత్రి 11 గంటలకు చెన్నై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

అయితే, రజనీకాంత్‌ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. దీనికి ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అభిమానులు, శ్రేయోభిలాషులు ఆస్పత్రిలో భరోసా నింపారు.

కాగా ఈ ఆపరేషన్‌ ప్రక్రియ అంతా సజావుగా జరిగి ఇంటికి చేరుకోవడంతో.. రజినీ ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆనందంగా ఉన్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన సమయంలో రజనీ.. అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటికి వెళుతున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రజనీ తన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాతనే ‘కూలీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని కోలీవుడ్ సినీ వర్గాల సమాచారం.

ALSO READ | సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కలి.. మంచి కంటెంట్తో వస్తోన్న మూవీ ఇది : హీరో వరుణ్‌ తేజ్‌

రజనీకాంత్‌.. జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ వేట్టయాన్‌. ఈనెల (అక్టోబర్ 10న) దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి టాక్‌ సొంతం వస్తోంది.