సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) స్పెషల్ రోల్ చేస్తున్న లేటెస్ట్ మూవీ లాల్ సలామ్ (Lal Salaam). ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ సంతోష్ (Vikramnth santhosh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న లాల్ సలామ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా లాల్ సలామ్ సెన్సార్ కంప్లీట్ చేసుకుందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి యు / ఏ (U/A) సర్టిఫికెట్ పొందినట్లు తెలిపారు.
LAL SALAAM secures a U/A! ? Ensuring a thrilling match and pulse-pounding rivalries at the theatres! ??#LalSalaam ? In Cinemas ?️✨ this FRIDAY, Feb 9th 2024 ?️@rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @Ananthika108 @LycaProductions… pic.twitter.com/f1U90Dyl1u
— Lyca Productions (@LycaProductions) February 6, 2024
ఈ సందర్బంగా సెన్సార్ వాళ్లు మాట్లాడుతూ..లాల్ సలామ్ ఒక ఎమోషనల్ జర్నీ అని..మెయినుద్దీన్ పాత్రలో రజినీకాంత్ ఎంట్రీ ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. థియేటర్స్‌లో ఈ సినిమాను చూసి ఆడియన్స్ థ్రిల్ ఫీలైవుతారని సెన్సార్ వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ మూవీ రన్ టైమ్ విషయానికి వస్తే..2 గం.32 నిమిషాలుగా ఉండనుందని సమాచారం.
లాల్ సలామ్ మూవీ క్రికెట్, కమ్యూనిజం చుట్టూ జరిగిన అల్లర్లతో రాబోతుంది. ఈ మూవీలో రజనీకాంత్ రోల్ ఎంతో పవర్ ఫుల్గా ఉండబోతుంది. మెయినుద్దీన్ భాయ్ పాత్రలో రజినీ కనిపించిన తీరు, ఇంటెన్స్ లుక్స్ తో టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే లాల్ సలామ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, ఈ మూవీ అమెరికా. న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ప్రీమియర్ షోస్ పడనున్నాయి.
ALSO READ :- నారాయణ స్కూల్ లో స్టూడెంట్ సూసైడ్..
నటి జీవిత రాజశేఖర్ ఈ మూవీలో కీలక పాత్రతో రీ ఎంట్రీ ఇస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ మరొక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఐశ్వర్య రజినీకాంత్ దాదాపు 6 ఏళ్ళ తరువాత డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
'U/A' సర్టిఫికేట్: ఎవరైనా దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.