పేరుమోసిన నాయకుడు.. అడ్డుగా హీరో.. ఇలా అయితే కష్టమే!

సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్(Jailer). దర్శకుడు నెల్సన్ కుమార్(Nelson kumar) తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్.. ఆగస్టు 10న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. 

ఇక రజినికాంత్ కూడా చాలా కాలంగా సరైన హిట్ లేక సతమవుతున్నారు. అందుకే ఈ సినిమాపై రజిని కూడా చాలా ఆశలే పెట్టుకున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాపై టీమ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని సమాచారం. ఈ న్యూస్ తెలుసుకున్న రజిని ఫ్యాన్స్ కూడా సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. 

ALSO READ :రణబీర్ ఫుట్‌బాల్ ఆ ఒక్కరితో ఆడరంటా..ఎవరో ఊహించగలరా?

ఈ క్రమంలో జైలర్ నుండి వినిపిస్తున్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ వార్త రజిని అభిమానులను కలవరపెడుతోంది. తాజాగా జైలర్ స్టోరీ(Jailer movie story) ఇదే అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఆ న్యూస్ ప్రకారం.. జైలర్ సినిమాలో పేరుమోసిన లీడర్ ఒకరు ఉంటారు. అతను కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల జైలుకి వెళతారు. ఆయనను బయటకు తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ జైలుకి జైలర్ గా ఉన్న రజిని వాటిని అడ్డుకుంటారు. ఇదే జైలర్ సినిమా స్టోరీ అంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ వార్త చూసిన ఆడియన్స్.. ఒకే కథను ఎన్ని సార్లు తీస్తారు. ఇలా అయితే జైలర్ కూడా కష్టమే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి జైలర్ మూవీ రజినికి, అయన ఫ్యాన్స్ కు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుంది అనేది తెలియాలంటే.. ఆగస్టు 10 వరకు ఆగాల్సిందే.