Kalki 2898 AD: కల్కి ఒక గొప్ప సినిమా.. నాగ్ అశ్విన్ పై సూపర్ స్టార్ ప్రశంసలు

Kalki 2898 AD: కల్కి ఒక గొప్ప సినిమా.. నాగ్ అశ్విన్ పై సూపర్ స్టార్ ప్రశంసలు

కల్కి 2898 పై దేశవిదేశాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా అద్భుతమంటూ స్టార్ హీరోలు, స్టార్ టెక్నీషియన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. హాలీవుడ్ ప్రముఖులు సైతం కల్కి సినిమాన పొగుడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ లిస్టులో సూపర్ స్టార్ రజనీకాంత్ చేరారు. తాజాగా కల్కి 2898 ఏడీ సినిమా చూసిన ఆయన చిత్ర యూనిట్ ను పొగడ్తలతో ముంచేత్తారు. 

ఈ విషయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నేను కల్కి సినిమా చూశాను. చాలా గొప్పగా ఉంది సినిమా. దర్శకుడు నాగ్ అశ్విన్ భారతీయ సినిమాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు. చిత్ర నిర్మాత, నా ప్రియమైన స్నేహితుడు  అశ్విని దత్ కు హృదయపూర్వక అభినందనలు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనె చేస్తున్న కల్కి పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అందుకోసం భగవంతుడు ఆశీర్వదిస్తాడు.. అంటూ కల్కి సినిమాపై, చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు రజనీకాంత్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక కల్కి 2898 ఏడీ సినిమా విషయానికి వస్తే.. జూన్ 27న భారీ అంచనాల మద్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు ఏకంగా రూ.191 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రెండు రోజుల్లో రూ.298 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ చేసింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందునా.. త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.