సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) స్పెషల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్ (Lal Salaam). ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya) దర్శకత్వంలో ఇవాళ ( ఫిబ్రవరి 9న) థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ సినిమాలో విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ సంతోష్ (Vikramnth santhosh) ప్రధాన పాత్రల్లో నటించారు. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
లేటెస్ట్గా రజినీకాంత్ లాల్ సలామ్ మూవీ రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ ద్వారా కూతురు ఐశ్వర్యకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. అలాగే తన కూతురు ఐశ్వర్య తో ఉన్న ఒక అరుదైన ఫోటోను రజినీ పంచుకున్నాడు.
என் அன்பு தாய் ஐஸ்வர்யாவுக்கு என் அன்பு சலாம்.உங்களுடைய லால் சலாம் திரைப்படம் மிகப்பெரிய வெற்றி அடைய எல்லாம் வல்ல இறைவனை வேண்டுகிறேன்@ash_rajinikanth #LalSalaam pic.twitter.com/bmRe8AGLkN
— Rajinikanth (@rajinikanth) February 9, 2024
వీల్ చైర్‌లో రజినీకాంత్ కూర్చుని ఉండగా, ఆ చైర్ ను ఐశ్వర్య నడిపిస్తూ ఉన్నఈ ఫోటో..సూపర్ స్టార్ ఫ్యాన్స్కు కు తెగ నచ్చేస్తుంది. ఈ పోస్ట్లో ' నా ప్రియమైన తల్లికి..లాల్ సలామ్ పెద్ద సక్సెస్ అవ్వాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను అంటూ పోస్ట్లో తెలిపారు. రజినీకాంత్ ఎమోషనల్ గా పోస్ట్ చేయడం చూస్తుంటే..కూతురు ఐశ్వర్య అంటే రజినీ కాంత్కు ఎంత ప్రేమ అనేది తెలుస్తోంది.
Also Read : అంతా ప్రేమమయం.. ప్రేమికుల రోజున రీ-రిలీజ్ అవుతున్న క్లాసిక్ సినిమాలు
క్రికెట్, కమ్యూనిజం చుట్టూ జరిగిన అల్లర్లతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఐశ్వర్య రజినీకాంత్ దాదాపు 6 ఏళ్ళ తరువాత డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో..భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాధిస్తుందో తెలియాలంటే ఫస్ట్ డే టాక్..అండ్ కలెక్షన్స్ బట్టి తెలిసే అవకాశం ఉంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.