Vettaiyan: సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ రిలిజ్.. ఆఫీసులకు సెలవు!

Vettaiyan: సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ రిలిజ్.. ఆఫీసులకు సెలవు!

తలైవా రజినీకాంత్(Rajinikanth170)వ  మూవీ వెట్టయాన్‌ (Vettaiyan) రేపు గురువారం (అక్టోబర్‌ 10న) ద‌స‌రా కానుక‌గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ (Tj Gnanavel) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అడ్వాన్స్‌డ్ బుకింగ్‌లు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి.

ఇకపోతే.. రజినీకి దేశ విదేశాల్లో ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉంటారో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలు రిలీజైతే తమిళనాడులో ఆఫీసులకు హాలిడే ఇవ్వడం ఎప్పటినుండో సంప్రదాయంగా వస్తోంది. గతంలో చూసుకుంటే రోబో, శివాజీ, కబాలి రిలీజ్ కు కొన్ని కంపెనీస్ సెలవులు ప్రకటించింది తెలిసిందే.

ఈ క్రమంలో వెట్టయాన్‌ సినిమాకు హాలిడేస్ ఇస్తున్నారా..లేదా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు. కాగా తమిళనాడు చెన్నైలోని ప్రముఖ కంపెనీలు ఉద్యోగస్తులకు హాలిడే ప్రకటించినట్లు తెలుస్తోంది.

Also Read : వార్ 2 నుండి క్రేజీ న్యూస్

ఈ మేరకు సదరు కంపెనీల ఉద్యోగులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ పోస్టులు చూసిన తలైవా ఫ్యాన్స్.. ' రజినీ హవా తగ్గేదేలే.. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి తలైవా స్టామినా తగ్గదని కామెంట్స్ చేస్తున్నారు. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్,ఫాహద్‌ ఫాజిల్,రానా,మంజు వారియర్,రితికాసింగ్, దుషారా విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జైలర్ రేంజ్ లో ఈ వేట్టయన్ కూడా రికార్డులు తిరగరాస్తుందన్న ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు.ఏమవుతుందో చూడాలి.

  • Beta
Beta feature