Vettaiyan Review: 'వెట్టయన్‌' మూవీ రివ్యూ.. ర‌జ‌నీకాంత్ ఖాతాలో మరో హిట్ పడిందా?

Vettaiyan Review: 'వెట్టయన్‌' మూవీ రివ్యూ.. ర‌జ‌నీకాంత్ ఖాతాలో మరో హిట్ పడిందా?

జైలర్ సక్సెస్తో సూపర్ స్టార్ రజనీ కాంత్‍ (Rajinikanth) నెక్స్ట్ తన170 మూవీ వెట్టయన్‌ - ద హంటర్' తో ఇవాళ గురువారం (అక్టోబర్ 10న) థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

హీరో సూర్యతో కలిసి ‘జై భీమ్‌‌‌‌’ మూవీ తీసి మెప్పించిన టీజే జ్ఞానవేల్..ఇపుడు రజినీతో సోషల్ మెసేజ్ టచ్ ఉండేలా ఓ పవర్ ప్యాకెడ్ కాప్ థ్రిల్లర్ని తెరకెక్కించాడు. బిగ్ బి అమితాబ్‌బ‌చ్చ‌న్‌, రానా ద‌గ్గుబాటి, ఫ‌హాద్ ఫాజిల్ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ కాప్ థ్రిల్లర్ డ్రామా ఎలా ఉంది? వెట్టయన్‌తో రజినీ ఖాతాలో మరో హిట్ పడిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే:

పోలీస్ డిపార్టుమెంట్లో "హంటర్" గా పిలవబడే అథియ‌న్ (రజనీకాంత్) కన్యాకుమారి ఎస్పీ. నేరం చేసిన వాళ్లను అసలు క్షమించడు. డిపార్టుమెంట్లో అతనికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరు ఉంది. ఇలా ఒకరోజు తన స్కూల్లో గంజాయి వ్యవహారం గురించి స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఎస్పీ అథియ‌న్ దృష్టికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత శరణ్యకు ప్రశంసలు రావడంతో పాటు.. ఆమె కోరుకున్నట్టు చెన్నైకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక అనూహ్య పరిస్థితుల్లో శరణ్యపై హత్యాచారం జరుగుతుంది. ఆమె కేసును పర్సనల్గా తీసుకున్న ఎస్పీ ఆ కేసులో అనుమానితుడిగా ఉన్న గుణను ఎన్కౌంటర్లో చంపేస్తాడు. దాంతో హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి వచ్చిన న్యాయమూర్తి సత్యదేవ్ (అమితాబచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేస్తారు.ఇక ఆ తర్వాత అసలు గుణ హత్య జరిగిన ప్రాంతంలోనే లేడని సత్యదేవ్ కమిటీ విచారణలో తేలుతుంది.

అయితే శరణ్యను చంపింది ఎవరు? గుణను చంపి తప్పు చేశానని తెలుసుకున్న ఎస్పీ ఏం చేశాడు? అతియన్ జీవితంలో, శరణ్య రేప్ అండ్ మర్డర్ కేసులో బ్యాటరీ అలియాస్ ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) తదితరుల పాత్రలు ఏమిటి? చివరకు అసలు హంతకుడిని అథియ‌న్ ఎలా కనిపెట్టాడు? అథియ‌న్ చేసిన ఎన్‌కౌంట‌ర్ స‌రైందేనా? అథియ‌న్ సిద్ధాంతాన్ని స‌త్య‌దేవ్ ఎందుకు వ్య‌తిరేకించాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే.. వెట్టయన్‌ సినిమాను థియేటర్లో చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

ఈ మధ్య కాలంలో క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు మారుపేరుగా నిలుస్తూ వ‌స్తోన్నారు తలైవా. ప్రస్తుతం రజినీ తీసే సినిమాల్లో క‌థ కంటే త‌న‌కున్న‌ మాస్ ఇమేజ్‌ను చాటిచెప్పే హీరోయిజం, ఎలివేష‌న్లు, స్వాగ్‌, మేరిజ‌మ్స్‌తో కూడిన సినిమాలే ఎక్కువ‌గా చేస్తూ వస్తున్నారు.అయితే, అందులో కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచినా.. జైలర్ తో మాత్రం సక్సెస్ కొట్టాడు.

అయితే.. లేటెస్ట్ వేట్ట‌య‌న్ తో మాత్రం తనదైన స్టైల్ ని కొనసాగిస్తూనే.. సోషల్ మెసేజ్ తో సినిమా చేసాడు. ఈ సినిమాలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో అనుకోకుండా తప్పుడు ఎన్కౌంటర్ చేయడం, ఆ ఎన్కౌంటర్లో మరణించిన వ్యక్తికి న్యాయం చేయడం కోసం ఏం చేశాడో తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ఎన్కౌంటర్ క్యారెక్టర్ రొటీన్ కావచ్చు. కానీ, అది బేస్ చేసుకుని జ్ఞానవేల్ చెప్పిన కథలో మాత్రం మంచి మెసేజ్ ఉంది. అలాగని, ఆడియన్స్ కు క్లాస్ పీకకుండా స్క్రీన్ ప్లే నడిపించిన తీరు తలైవా ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది.

ఫస్టాఫ్ లోనే రజినీకాంత్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యారు డైరెక్ట‌ర్ టీజే జ్ఞాన‌వేళ్. ఆ తర్వాత మొదలయ్యే కథనం ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇంటర్వెల్ కి వచ్చే ట్విస్ట్ సెకండాఫ్ పై మరింత ఇంట్రెస్ట్ పెంచుతోంది.

ఇక సెకండాఫ్ మాత్రం క‌థ‌లో వేగం త‌గ్గ‌డంతో బోర్ కొట్టిన అనుభూతిని క‌లిగిస్తుంది. కానీ, త‌ప్పు చేసిన వాడిని ఎన్‌కౌంట‌ర్‌లో లేపేయ‌డం స‌రైందేన‌ని న‌మ్మే పోలీస్‌కు, నేర‌స్తుల‌కు న్యాయ‌బ‌ద్ధంగానే శిక్ష‌ప‌డాల‌ని న‌మ్మే న్యాయ‌మూర్తి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ చుట్టూ సెకండాఫ్ ఇంట్రెస్టింగ్‌గా సాగడంతో ఆడియన్స్ ను సీట్ లో కూర్చోబెట్టేలా చేసాడు డైరెక్టర్.మొత్తానికి ఎన్‌కౌంట‌ర్లు చ‌ట్టానికి లోబ‌డే జ‌రుగుతుంటాయా? ఎన్‌కౌంట‌ర్ల‌ను న్యాయ‌వ్య‌వ‌స్థ స‌మ‌ర్థిస్తుందా? వ్య‌తిరేకిస్తుందా? అనే అంశాల‌ను క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి డైరెక్టర్ వేట్ట‌య‌న్ మూవీలో ఎమోషనల్ గా చూపించడం మెచ్చుకోవాల్సిన విషయం. 

ఎవరెలా చేశారంటే::

రజినీకాంత్, అమితాబ్ గురించి చెప్పాలంటే.. ‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిజేయాలి.. అంతేకానీ ఇంకో అన్యాయంతో కాదు’ అని ఎన్‌‌‌‌కౌంటర్స్‌‌‌‌ను వ్యతిరేకించే పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ స‌త్య‌దేవ్‌ గా అమితాబ్‌‌‌‌ కనిపించారు.

‘క్రైమ్ క్యాన్సర్ లాంటిదని, దాన్ని పెరగనివ్వకుండా, అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పేమీ కాదు’ అనుకునే ఎన్‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌ స్పెషలిస్ట్‌‌‌‌గా రజినీ నటించాడు. వీరిద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రజినీ డైలాగ్ డెలివ‌రీ, మ్యాన‌రిజ‌మ్స్ ఆక‌ట్టుకుంటాయి. స‌త్య‌దేవ్‌గా పాత్ర‌లో సెటిల్డ్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచాడు అమితాబ్‌బ‌చ్చ‌న్‌. ఇద్ద‌రు స్క్రీన్‌పై క‌నిపించే సీన్స్ విజిల్స్ వేయిస్తాయి.

ఫ‌హాద్ ఫాజిల్ (ఫాఫా) క్యారెక్టర్ తో సూపర్ ఫన్ ఇచ్చేశాడు. నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో రానా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. దుషారా విజయన్ ఎమోషనల్ పాత్రలో జీవించింది. రితికా సింగ్, అభిరామి, రోహిణి ఇలా ఎవరికి వారు తమ పాత్రలను చాలా సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. మంజు వారియర్ కనిపించింది తక్కువ సీన్స్ అయినా మెప్పించింది.  ఇక మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. 

సాంకేతిక అంశాలు:

డైరెక్ట‌ర్ టీజే జ్ఞాన‌వేళ్ వేట్ట‌య‌న్ పోలీసులు అనే వారు హంట‌ర్స్‌లా కాకుండా స‌మాజానికి ప్రొటెక్ట‌ర్స్‌గా ఉండాల‌నే సందేశంతో సినిమాకు క్రైమ్ నేపధ్యం జోడించి సక్సెస్ అయ్యారు. అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా రజినీకాంత్ ని ఎలివేట్ చేసే సీన్స్ కొన్నే ఉన్నా వాటిని తనదైన శైలిలో డబుల్ ఇంపాక్ట్ చూపించి దుమ్ములేపేశాడు.ఫిలోమిన్ రాజ్‌ ఎడిటింగ్ బాగుంది గాని, సెకండ్ హాఫ్ ను ఇంకా టైట్ గా ట్రిమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. ఎస్.ఆర్. కతీర్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

  • Beta
Beta feature