
- కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తున్న నలుగురి అరెస్ట్
- 80 కిలోల సరుకు స్వాధీనం
వికారాబాద్, వెలుగు : కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయిని తరలిస్తున్న నలుగురిని వికారాబాద్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ ఆఫీసర్ నవీన్ చంద్ర, సీఐ రాఘవేంద్ర, టాస్క్ ఫోర్స్ ఎస్సై కోటేశ్వర్ వివరాలు వెల్లడించారు. భువనేశ్వర్ నుంచి ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్ ప్రెస్‌లో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం వికారాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.
నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీట్ల మీద బెడ్స్ మాదిరిగా గంజాయి ప్యాకెట్లను ప్యాక్ చేసి ఉంచినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.20 లక్షల విలువైన 80 కిలోల గంజాయిని సీజ్ చేశారు. నిందితులు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి పుణెకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది.
ఘట్కేసర్లో 10 కిలోల గంజాయి సీజ్
ఘట్కేసర్ ఎక్సైజ్ పీఎస్ పరిధి యమ్నంపేట చౌరస్తాలో శుక్రవారం ఘట్ కేసర్ ఎక్సైజ్ సీఐ మల్లయ్య, మల్కాజిగిరి టాస్క్ ఫోర్స్ సీఐ భరత్ భూషణ్ ఆధ్వర్యంలో పోలీసులు వెహికల్ చెకింగ్ చేపట్టారు. ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. 10 కిలోల గంజాయి బయటపడింది. కారులో ఉన్న కరీంనగర్‌కు చెందిన ప్రణీత్(24),ఏపీలోని కాకినాడకు చెందిన సతీశ్(25)
మధుకుమార్ (22), వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన శివరాం(28), హనుమకొండకు చెందిన హేమంత్(21)ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదుగురు ఏపీలోని అరకు నుంచి గంజాయిని తీసుకొచ్చి సిటీ శివార్లలోని కాలేజీల్లో స్టూడెంట్లకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.