హైదరాబాద్: జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వ్యక్తి గట్టు రట్టు చేశారు పోలీసులు. డెలివరీ బాయ్ ముసుగులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న షేక్ బిలాల్ ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగేళ్లుగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు షేక్ బిలాల్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసేందుకే జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు బిలాల్. షేక్ బిలాల్ నుంచి 45 మంది ఐటీ ఎంప్లాయీస్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. వీళ్లంతా స్నాప్ చాట్, టెలిగ్రామ్ ద్వారా షేక్ బిలాల్ కు కాంటాక్ట్ అయి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు.
డ్రగ్స్ తీసుకుంటున్న 45 మంది ఐటీ ఎంప్లాయీస్ ను రీహాబిలిటేషన్ కు తరలిస్తామని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందుకున్న యాంటీ నార్కోటిక్ పోలీసులు, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనకీల్లో షేక్ బిలాల్ ను అరెస్ట్ చేశారు. బిలాల్ నుంచి 12 లక్షల విలువైన 15 గ్రామా MDMA, 22 కిలోల గంజాయి, 71 నైట్రోసిన్ ట్యాబ్లెట్లు, 491 గ్రాముల హాష్ ఆయిల్ ను సీజ్ చేశారు.
రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ డ్రగ్స్ కి బానిస అయ్యాడని.. అరకు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో అమ్ముతున్నట్లు డీసీపీ వినీత్ చెప్పారు. గతంలో NDPS కేసులో అరెస్ట్ అయి షేక్ బిలాల్ జైలుకు కూడా వెళ్లినట్లు చెప్పారు. జైల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ డ్రగ్స్ సరఫరా మొదలు పెట్టాడని డీసీపీ చెప్పారు.