
మెదక్, వెలుగు : మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అసంతృప్త నాయకులు మంగళవారం దూలపల్లిలోని ఆయన ఇంట్లో కలిశారు. రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, అడ్వకేట్జీవన్ రావు, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి
ALSO READ : బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం: గువ్వల బాల్ రాజు
పాపన్నపేట మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, రంగారావు, సుధాకర్, మనోజ్,నోముల శ్రీకాంత్, స్వామి నాయక్, రమేశ్‌గౌడ్, కరుణాకర్ తదితరులు మైనంపల్లికి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మైనంపల్లి హన్మంతరావు ఢిల్లీ వెళ్లగా కొందరు నాయకులు ఆయన వెంట వెళ్లారు.