సపోర్ట్ హైడ్రా.. సేవ్ హైదరాబాద్ ట్యాగ్ లైన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్

సపోర్ట్ హైడ్రా.. సేవ్ హైదరాబాద్ ట్యాగ్ లైన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్
  •  చెన్నయ్, బెంగళూరు వరదలపై పోస్టులు
  •  నెట్టింట మునిగిన ఫ్లై ఓవర్ల ఫొటోలు ట్యాగ్
  •  నగరాన్ని కాపాడుకుందామంటున్న నెటిజన్లు
  •  వరదల వీడియోలను పోస్టు చేస్తూ అవేర్ నెస్

హైదరాబాద్: మొన్న విజయవాడ నీటమునిగింది. ఇప్పుడు చెన్నయ్, బెంగళూరు భారీ వర్షాలకు చివురుటాకుల్లా వణికిపోతున్నాయి. రోడ్లు మునిగి ఫ్లై ఓవర్ల పైకి నీళ్లొచ్చాయి. కాలనీలు నదుల్లా మారాయి. వీధుల్లో బస్సులు, కార్లు, బైకులకు బదులు పడవలు తిరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఉండాల్సిన చౌరస్తాల్లో రెస్క్యూ టీమ్స్ సేవలందిస్తున్నాయి. ఇది ప్రస్తుతం దక్షిణ భారతంలో అతిపెద్ద సిటీలుగా పేరున్న చెన్నయ్, బెంగళూరులో పరిస్థితి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

ALSO READ  | హైడ్రా తరహాలో.. హైదరాబాద్‍లో ఫుట్‌పాత్‌లపై షాపులు నేలమట్టం

హైదరాబాద్ కు ఇలాంటి పరిస్థితి రాకుడదని భగవంతుడిని వేడుకుంటున్నారు నెటిజెన్లు. నగరం బాగుండాలంటే మూసీ ప్రక్షాళన జరగాలని, చెరువులు ఆక్రమించి నిర్మించుకున్న కట్టడాలను కూల్చివేయడమే శరణ్యమంటున్నారు. చెన్నయ్ నగరంలోని వేల చెరి చెరువు గతంలో 265 ఎకరాల్లో విస్తరించి ఉండేదని, దానిని ఆక్రమించి ఇండ్లు నిర్మించుకోవడంతో ఇప్పుడు కేవలం యాభై ఎకరాలకే పరిమితమైందని, కబ్జా చేసి కట్టుకున్న ఇండ్లన్నీ ఇప్పుడు నీళ్లలోనే ఉన్నాయంటూ గూగుల్ మ్యాప్ ను పోస్టు చేశారు. 1980లో ఈ చెరువు బాగానే ఉందని ఈ 44 ఏండ్లలో ఆక్రమణల కారణంగా కుచించుకు పోయిందని పోస్టులు పెడుతున్నారు. వరదలకు అతలాకుతలమైన చెన్నయ్ నగరాన్ని చూశాం.. వరదలతో హైదరాబాద్ అలా అవకుండా హైడ్రాతో చెరువులను అరికట్టేందుకు పాలకులు కృషి చేస్తుంటే..? తిడదామా..? సమర్థిద్దామా..? అంటూ పెట్టిన ఓ పోస్టు వైరల్ గా మారింది. 

హైదరాబాద్ కు ఇలాంటి  పరిస్థితి రావొద్దు

‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు  మూసీ ప్రక్షాళన, మూసీ పరిరక్షణ నిర్ణయం తీసుకుంది రాబోయే రోజుల్లో హైదరాబాద్ కి ఇటువంటి పరిస్థితి రాకూడదనే..గత నాలుగు రోజులుగా చెన్నై, బెంగళూరులో పరిస్థితి చూస్తున్న హైదరాబాద్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైనదే అని నమ్ముతున్నారు.’అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి ట్వీట్  చేశారు...