తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు ఉదయం(జనవరి 15) సుప్రభాత సేవలు పునఃప్రారంభమయ్యాయి. పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం(జనవరి 14) ముగియడంతో.. సోమవారం ఉదయం నుంచి సుప్రభాత సేవలను ఆలయ అర్చలు మళ్లి ప్రారంభించారు.
గత ఏడాది డిసెంబరు 17వ తేదీ తెల్లవారుజాము నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కాగా.. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగించారు. అయితే జనవరి 14వ తేదీన ధనుర్మాస ఘడియలు పూర్తికావడంతో.. జనవరి 15వ తేదీ నుంచి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహించారు ఆలయ అర్చకులు.