హైదరాబాద్, వెలుగు: కృష్ణా జల వివాదాలపై సుప్రీంలో విచారణ వాయిదా పడింది. ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలన్న కేంద్రం గెజిట్ను కొట్టేయాలన్న తెలంగాణ పిటిషన్, శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిపై ఏపీ వేసిన పిటిషన్ల విచారణను జనవరి 24కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రెండు పిటిషన్లు వేర్వేరు బెంచ్లకు బదిలీకాగా.. వీటిని ఒకే బెంచ్కు బదిలీ అయ్యేలా సీజేఐ అనుమతి అవసరమని నవంబర్ 4న సుప్రీం బెంచ్ ఆదేశాలిచ్చింది.
సీజేఐ అనుమతి లేకుండానే గురువారం మళ్లీ జస్టిస్ ఓకా, జస్టిస్అగస్టిన్ల బెంచ్కు పిటిషన్లను విచారించేందుకు రిజిస్ట్రార్ పంపించారు. కేస్ఫైల్లో సీజేఐ ఆదేశాలు లేవు కాబట్టి సీజేఐ ఆదేశాలను జత చేసి కేస్ఫైల్ను సమర్పించాలని రిజిస్ట్రార్ను మరోసారి ఆదేశించారు.